Assembly Elections: ఛత్తీస్‌గడ్,మిజోరంలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలోని 90 స్థానాలకు గానూ 20 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.
Assembly Elections: మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలోని 90 స్థానాలకు గానూ 20 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు..(Assembly Elections)
తొలి దశలో పోలింగ్ జరుగనున్న ఈ 20 స్థానాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచిన 223 మంది అభ్యర్థుల్లో 25 మంది మహిళలున్నారు. తొలిదశలో మొత్తం 5వేల, 304 పోలింగ్ కేంద్రాల్లో 40.78 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.మొదటి విడత పోలింగ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం బస్తర్‌లోని 12 నియోజకవర్గాల్లో జరగనున్నందున అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. వీరిలో 40 వేల మంది కేంద్ర సాయుధ రిజర్వు బలగాలున్నాయి.ఛత్తీస్‌గఢ్‌లో ఉదయం 11 గంటల సమయానికి 22.97% ఓటింగ్ నమోదయింది.
కొంటా అసెంబ్లీ నియోజకవర్గంలోని దుర్మా పోలింగ్ స్టేషన్ పరిసరాల్లో నక్సలైట్లు మరియు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) మధ్య కాల్పులు జరిగినట్లు నివేదికలు వెలువడ్డాయి. నక్సలైట్లు ఓటింగ్ బహిష్కరణ విధించి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లను పాల్గొనకుండా అడ్డుకుంటున్నారు.ప్రాథమిక నివేదికల ప్రకారం ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సుక్మాలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) తెలిపారు. 10 నిమిషాల తర్వాత కాల్పులు ఆగిపోయి కొద్దిసేపటికే మళ్లీ ఓటింగ్ ప్రారంభమైంది.
మిజోరంలో 40 స్థానాలకు…
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో.. 40 సీట్ల కోసం 174మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 8లక్షల, 53వేల, 88 మంది ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ కోసం 12 వందల 76 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్రంలోని 30 పోలింగ్ కేంద్రాలను సున్నితమైన ప్రాంతాలుగా ప్రకటించారు అధికరాలు. మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మెజారిటీకి 21 సీట్లు అవసరం. 2018లో జరిగిన ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రెంట్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.