Home / AP CID
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలన్న సిఐడి పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. గతవారం ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం వాదనలు విననుంది
మార్గదర్శి చిట్ ఫండ్ ఛైర్మన్ రామోజీరావుపై ఏపీ సీఐడీకి మరో ఫిర్యాదు అందింది. మార్గదర్శిలో తనకు రావాల్సిన షేర్లు ఇవ్వకుండా తుపాకీతో బెదిరించారని మార్గదర్శిలో పెట్టుబడి పెట్టిన జి.జగన్నాథరెడ్డి కుమారుడు యూరిరెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు.
ఏపీ అసైన్డ్ భూముల కేసులో కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణలో వాదనలు పూర్తి కావడంతో ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ అసైన్డ్ భూముల కేసులో కొత్త ఆధారాలు దొరికాయంటూ ఏపీ సిఐడి కోర్టు దృష్టికి తెచ్చింది. ఆడియో ఆధారాలని సిఐడి అధికారులు సమర్పించారు. రేపు వీడియో ఆధారాలు అందజేస్తామని సిఐడి చెప్పింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్‌లో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు సీఐడీ నోటీసులు అందించింది. అక్టోబర్ 4వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ స్కామ్‌లో నారాయణ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ఇదివరకే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో తెదేపా ముఖ్య నేత నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి గతేడాది కేసు నమోదవ్వగా.. ఇటీవలే ఏ14గా లోకేశ్ పేరును సీఐడీ అధికారులు చేర్చారు. అక్టోబరు 4వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ సీఐడీ ఊహించని షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ ఏ14గా పేర్కొంది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఇక ఇప్పటికే ఈ కేసులో సీఐడీ అధికారులు.. చంద్రబాబు నాయుడుతో పాటు
Nara Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. కాగా ఒకవైపు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు.. మరోవైపు కస్టడీ పొడిగించాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కాగా నేడు ఈ పిటిషన్లపై విచారణను విజయవాడలోని ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. అయితే చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏ పిటిషన్ పై విచారణ […]
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయడును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడే అని
రామోజీ సంస్థల అథినేత రామోజీ రావుకు ఏపీ సీఐడీ ఊహించని షాక్ ఇచ్చింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు హోమ్ శాఖ సీఐడీని అనుమతించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నారాయణతో పాటు ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ ఎండీ అంజనీకుమార్, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్లు పునీత్, వరుణ్‌లకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.