Home / AP CID
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో సీఐడీ అధికారులు రెండో రోజు సోదాలు కొనసాగిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంత భూవివాదానికి సంబంధించిన కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ అధికారులు.. హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లిలోని నారాయణ కుమార్తె నివాసాలపై శుక్రవవారం సోదాలు నిర్వహించారు.
2 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న కారణంగా తెల్లవారుజామున నానా హడావుడి చేసి తెదేపా నేత అయ్యన్న పాత్రుడితోపాటు కుమారుడు రాజేశ్ పై సీఐడి పోలీసులు పెట్టిన కేసులో 467 సెక్షన్ వర్తించదని కోర్టు తేల్చి చెప్పింది.
సివిల్ తగాదాకు, సీఐడీ పోలీసులకు ఉన్న సంబంధం ఏమిటని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సెంటు స్థల వివాదాన్ని సాకుగా చూపి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని తెల్లవారుజామున వందమంది పోలీసులు గోడలు దూకి వచ్చి అరెస్టు చేయడం అమానుషమని మండిపడ్డారు.
అయ్యన్నపాత్రుడు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అయ్యన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని, నిబంధనలు పాటించలేదని అయ్యన్న తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎంత స్థలం కబ్జా చేశారనేది అనేది మాకు ముఖ్యం కాదు. ఫోర్జరీ చేశారు అనేది మాకు ముఖ్యం. అయ్యన్నపాత్రుడు పై ఫిర్యాదు చేసిన వ్యక్తి మాములు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సీఐడీకి ఫిర్యాదు చేశాడు కాబట్టి మేం అరెస్ట్ చేసినట్లు ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ తెలిపారు.
టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు రావడం కలకలం రేపింది. బంజారాహిల్స్‌లోని విజయ్ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు శనివారం వచ్చారు. హైదరాబాద్ లోని విజయ్ ఇంట్లో అతను లేకపోవడంతో అతని సిబ్బందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.