Last Updated:

Chandrababu’s Bail: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలన్న సిఐడి పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. గతవారం ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం వాదనలు విననుంది

Chandrababu’s Bail: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్  పై  నేడు సుప్రీంలో విచారణ

Chandrababu’s Bail: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలన్న సిఐడి పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. గతవారం ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం వాదనలు విననుంది. చంద్రబాబుకి నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన సందర్భంగా హైకోర్టు తన పరిధి దాటిందని సీఐడీ పిటిషన్‌లో పేర్కొంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రమాణాలని హైకోర్టు అతిక్రమించి కేసు లోతుల్లోకి వెళ్లి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసిందని సీఐడీ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది.

సాక్షులను బెదిరిస్తారు..(Chandrababu’s Bail)

ట్రయల్ కోర్టుని ప్రభావితం చేసేలా కోర్టు తీర్పుందని, 39 పేజీల తీర్పు మినీ ట్రయల్‌ని తలపించిందని సిఐడి వివరించింది. స్కాంలో దుర్వినియోగమైన డబ్బులు టిడిపి ఖాతాల్లోకి వెళ్ళాయని ఆధారాలు సమర్పించినా హైకోర్టు ఏ మాత్రం పట్టించుకోలేదని సిఐడి చెబుతోంది. చంద్రబాబు నాయుడికి రాజకీయా పలుకుబడి ఉందని సాక్షులను బెదిరించడం ద్వారా దర్యాప్తుని ప్రభావితం చేస్తారని సిఐడి ఆరోపించింది. హైకోర్టు తేల్చిన అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని, చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో తేలేంతవరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ సిఐడి సుప్రీంకోర్టును కోరింది.