Nara Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్ – ఏపీ సీఐడీ
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ సీఐడీ ఊహించని షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ ఏ14గా పేర్కొంది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఇక ఇప్పటికే ఈ కేసులో సీఐడీ అధికారులు.. చంద్రబాబు నాయుడుతో పాటు

Nara Lokesh : తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ సీఐడీ ఊహించని షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ ఏ14గా పేర్కొంది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఇక ఇప్పటికే ఈ కేసులో సీఐడీ అధికారులు.. చంద్రబాబు నాయుడుతో పాటు పలువురిని నిందితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఇటీవల హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మళ్ళీ ఇప్పుడు అనూహ్యంగా లోకేష్ పేరు కూడా అందులో ఉండడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.