Home / andhrapradesh
విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం అనగా 10 వ తేదీ ఒక్కరోజు మాత్రమే లబ్దిదారుల ఖాతాల్లో నిధులు విడుదల చేయాలని కోరింది.
ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని కాపు, బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. తన అంచనాల గురించి 6 నిమిషాల నిడివిగల వీడియో రిలీజ్ చేశారు.
ఏపీలో పింఛన్ల ఇంటింటి పంపిణీకి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని తాజాగా ఈసీ ఆదేశించడం జరిగింది . ఫస్ట్ తారీకు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో పింఛన్ దారులలో టెన్షన్ మొదలవుతుంది .ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో గత నెలలో ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణి చేయడం కుదరలేదు .సచివాలయాలకు వెళ్లి తీసుకోవాల్సి వచ్చింది .
ఏపీ లో ప్రతి సాధారణ ఎన్నికలలో కులాలే విజయావకాశాలు శాసిస్తున్నాయని ,జనసేనాని పవన్ కళ్యాణ్ నినాదం అయిన బై బై వైసీపీ నిజం కావాలంటే కాపుల ఓట్లే కీలకమని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య అన్నారు . ఈ మేరకు ఆయన ఒక లేఖ విడుదల చేసారు . రాష్ట్రంలో ప్రస్తుతం 45శాతం బి.సి. లు ,18శాతం కాపులు, 16శాతం ఎస్.సి.లు, 6 శాతం ఎస్.టి.లు ,6శాతం రెడ్లు, 4శాతం కమ్మ 5శాతం యితరులు ఉన్నారని పేర్కొన్నారు
తాను దేన్నయినా ఎదుర్కొనేందుకుసిద్ధంగా ఉన్నానని, బీజేపీతో కుమ్మక్కైన వైఎస్సార్సీపీ, టీడీపీపై పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారా అంటూ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు.శనివారంఒంగోలులోప్రకాశంజిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలతో సమీక్షా సమావేశంలోపాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ యువత, ప్రజల బంగారు భవిష్యత్తు కోసమే తాను ఆంధ్రప్రదేశ్‌కి వచ్చానన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనల నుంచి రూపు దాల్చిన సంస్దలు IIIT RGUKT.. రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్. గ్రామీణ ప్రాంతాల విద్యార్దులు కేవలం టెన్త్ క్లాస్ మార్కులతో ప్రతిష్టాత్మక సంస్దల్లో ఇంజనీరింగ్ డిగ్రీని చదువుకునే విధంగా వీటిని స్దాపించారు.
తెలుగు సినిమా ఓ దిగ్గజ నటుడిని కోల్పోయింది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణ ఎన్ని పాత్రలు చేసినా కైకాల అంటే ప్రధానంగా గుర్తొచ్చేది యముడి పాత్రే.
"మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది మేమే. ఇందులో పెద్దపెద్ద వాళ్ల హస్తం ఉండడం వల్లే ఈ కేసు ముందుకు వెళ్లడం లేద"ని వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఆరోపించారు.
తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి . ఈ ఏడాది పడిన వర్షాలు ఏ ఏడాది కూడా పడలేదు . ఏవి ఆగిన వర్షాలు ఆగడం లేదు . ఈ ఏడాది ప్రకృతి తన విశ్వరూపం చూపిస్తుంది . రెండు రోజలకొకసారి వాతావరణం మారిపోతూనే ఉంటుంది . తెలుగు రాష్ట్రాల్లో, భారీ వర్షపాతం నమోదు ఐనందున ఎల్లో అలర్ట్ చేసినట్టు తెలిసిన సమాచారం .
ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేయనున్నట్లు తెలిసిన సమాచారం. 2022 ఆగష్టు 3 నుంచి ఆగష్టు 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం మన అందరికి తెలిసిందే.