Last Updated:

WPL FINAL: ఫైనల్‌ కు రంగం సిద్దం.. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ

WPL FINAL: మహిళల ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి తెరలేచింది. ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా తుదిపోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతోంది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

టాస్ గెలిచిన దిల్లీ.. (WPL FINAL)

మహిళల ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి తెరలేచింది. ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా తుదిపోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతోంది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఫైనల్ కు చేరిన దిల్లీ, ముంబై జట్లు ట్రోఫిని ముద్దాడెందుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు.. ట్రోఫిని ఎత్తుకెళ్లనుంది. ఇక ఫైనల్ పోరులో ముంబై ముంబై ఇండియన్స్‌ తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. దిల్లీ మాత్రం తమ జట్టులో ఒకే ఒక మార్పు చేసింది. పూనమ్‌ యాదవ్‌ స్థానంలో మిన్ను మణి తుది జట్టులోకి వచ్చింది.

ఉమెన్స్ ఐపీఎల్ తరహాలోనే ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. నేడు జరిగే ఫైనల్ పోరులో ఏ జట్టు గెలుస్తుందో వేచి చూడాలి.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్
హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), నటాలీ స్కివెర్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, సైకా ఇషాక్, హుమైరా కాజీ జింటిమణి కలిత

ఢిల్లీ క్యాపిటల్స్
మెగ్ లానింగ్(కెప్టెన్‌), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాస్సెన్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా(వికెట్‌ కీపర్‌), రాధా యాదవ్, శిఖా పాండే, మిన్ను మణి