KKR vs RR: బౌలింగ్ లో ఇరగదీసిన చాహల్.. రాజస్థాన్ లక్ష్యం 150 పరుగులు
KKR vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి.
KKR vs RR: చాహల్ సూపర్ బౌలింగ్ కి కోల్ కతా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగలిగింది. వెంకటేష్ అయ్యర్ మినహా పెద్దగా ఎవరు రాణించలేదు. నితీష్ రాణా 22 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
రాజస్థాన్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. బౌల్డ్ రెండు.. ఆసిఫ్, సందీప్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.
LIVE NEWS & UPDATES
-
KKR vs RR: చాహల్ సూపర్ బౌలింగ్.. రాజస్థాన్ లక్ష్యం 150 పరుగులు
చాహల్ సూపర్ బౌలింగ్ కి కోల్ కతా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగలిగింది. వెంకటేష్ అయ్యర్ మినహా పెద్దగా ఎవరు రాణించలేదు. నితీష్ రాణా 22 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
రాజస్థాన్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. బౌల్డ్ రెండు.. ఆసిఫ్, సందీప్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.
-
KKR vs RR: బౌలింగ్ లో చెలరేగిన చాహల్.. ఏడో వికెట్ డౌన్
చాహల్ బౌలింగ్ లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. డేంజర్ బ్యాట్స్ మెన్.. రింకూ సింగ్ ను ఔట్ చేశాడు.
-
KKR vs RR: ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. శార్దుల్ ఠాకూర్ ఔట్
చాహల్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. మెుదట అయ్యర్ ను ఔట్ చేయగా.. ఆ తర్వాత శార్దుల్ ఠాకూర్ ను ఔట్ చేశాడు. ఠాకూర్ ఒక్క పరుగు మాత్రమే చేశాడు.
-
KKR vs RR: వెంకటేష్ అయ్యర్ ఔట్.. ఐదో వికెట్ డౌన్
కీలక దశలో రాణిస్తున్న వెంకటేష్ అయ్యర్ క్యాచ్ ఔటయ్యాడు. చాహల్ బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు. చాహల్ రెండో వికెట్ తీసుకున్నాడు.
-
KKR vs RR: వెంకటేష్ అయ్యర్ అర్దసెంచరీ..
వెంకటేష్ అయ్యర్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 39 బంతుల్లో 50 పరుగులు చేశాడు. కీలక సమయంలో వెంకటేష్ రాణిస్తున్నాడు.
-
KKR vs RR: వెంకటేష్ అయ్యర్ జోరు
చాహల్ వేసిన 13 వ ఓవర్లో భారీగా పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో ఓ సిక్స్, రెండు ఫోర్లు వచ్చాయి.
-
KKR vs RR: మూడో వికెట్ డౌన్.. కోల్ కతా కెప్టెన్ ఔట్
కోల్ కతా మూడో వికెట్ కోల్పోయింది. చాహాల్ తొలి ఓవర్లోనే రాణాను ఔట్ చేశాడు.
-
KKR vs RR: అశ్విన్ ఓవర్ చిత్తు.. 18 పరుగులు
అశ్విన్ వేసిన ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. వెంకటేష్ అయ్యార్ రెండు సిక్సలు కొట్టగా.. చివరి బంతికి నితీష్ రాణా ఫోర్ కొట్టాడు.
-
KKR vs RR: 8 ఓవర్లకు.. 50 పరుగులు
8 ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా 50 పరుగులు చేసింది.
-
KKR vs RR: ముగిసిన పవర్ ప్లే.. నెమ్మదిగా కోల్ కతా బ్యాటింగ్
పవర్ ప్లే ముగిసేసరికి కోల్ కతా 37 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు ఔటవ్వడంతో కోల్ కతా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తోంది.
-
KKR vs RR: రెండు వికెట్ డౌన్.. గుర్బాజ్ ఔట్
కోల్ కతా రెండో వికెట్ కోల్పోయింది. బౌల్డ్ బౌలింగ్ లో గుర్బాజ్ క్యాచ్ ఔటయ్యాడు.
-
KKR vs RR: రెండు బంతులు.. రెండు సిక్సులు
సందీప్ శర్మ వేసిన రెండు బంతులను గుర్బాజ్ రెండు సిక్సర్లుగా మలిచాడు.
-
KKR vs RR: తొలి వికెట్ డౌన్.. అద్భుతమైన క్యాచ్ అందుకున్న హెట్ మేయర్
కోల్ కతా తొలి వికెట్ కోల్పోయింది. బౌల్డ్ బౌలింగ్ లో రాయ్ క్యాచ్ ఔటయ్యాడు. బౌండరీ వద్ద హెట్ మేయర్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు.
-
KKR vs RR: రెండో ఓవర్.. కేవలం ఒక్క ఫోర్
సందీప్ శర్మ వేసిన రెండో ఓవర్లో 4 పరుగులే వచ్చాయి.
-
KKR vs RR: తొలి ఓవర్.. 6 పరుగులు
ట్రెంట్ బౌల్డ్ వేసిన తొలి ఓవర్లో 6 పరుగులు వచ్చాయి.
-
KKR vs RR: క్రీజులోకి జేసన్ రాయ్, గుర్బాజ్
ట్రెంట్ బౌల్డ్ తొలి ఓవర్ వేస్తున్నాడు.
-
KKR vs RR: రాజస్థాన్ టీం ఇదే
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, కేఎం ఆసిఫ్, యుజువేంద్ర చాహల్
-
KKR vs RR: కోల్ కతా బ్యాటింగ్.. జట్టు ఇదే
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
-
KKR vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్..
టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కతా మొదట బ్యాటింగ్ చేయనుంది.