IPL 2023 PlayOff: రసవత్తరంగా ఐపీఎల్.. ప్లే ఆఫ్స్ కు చేరే నాలుగు జట్లు ఇవేనా?
IPL 2023 PlayOff: ఐపీఎల్ లో రసవత్తర పోరు నడుస్తోంది. లీగ్ మ్యాచులు చివరి దశకు చేరాయి. అయినా కూడా ప్లే ఆఫ్ జట్లు ఏవో ఇంకా ఖరారు కాలేదు.
IPL 2023 PlayOff: ఐపీఎల్ లో రసవత్తర పోరు నడుస్తోంది. లీగ్ మ్యాచులు చివరి దశకు చేరాయి. అయినా కూడా ప్లే ఆఫ్ జట్లు ఏవో ఇంకా ఖరారు కాలేదు. ఎందుకంటే ప్రతిజట్టు ఇంకా రేసులో ఉండటమే దీనికి కారణం. అయితే రెండు జట్లు మాత్రం.. ప్లే ఆఫ్ రేసులో ముందున్నాయి. మరి ఈ ఏడాది ప్లే ఆఫ్స్ కు వెళ్లే నాలుగు జట్లేవో ఓసారి చూద్దాం.
నాలుగు జట్లు.. ఇవేనా? (IPL 2023 PlayOff)
ఐపీఎల్ లో రసవత్తర పోరు నడుస్తోంది. లీగ్ మ్యాచులు చివరి దశకు చేరాయి. అయినా కూడా ప్లే ఆఫ్ జట్లు ఏవో ఇంకా ఖరారు కాలేదు.
ఎందుకంటే ప్రతిజట్టు ఇంకా రేసులో ఉండటమే దీనికి కారణం. అయితే రెండు జట్లు మాత్రం.. ప్లే ఆఫ్ రేసులో ముందున్నాయి.
మరి ఈ ఏడాది ప్లే ఆఫ్స్ కు వెళ్లే నాలుగు జట్లేవో ఓసారి చూద్దాం.
ఈ సీజన్ లో లీగ్ మ్యాచులు చివరి దశకు వచ్చాయి. మరో 15 లీగ్ మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఇక పాయింట్ల పట్టికలో మెుదటి నాలుగు స్థానంలో ఉన్న జట్లే.. ప్లే ఆఫ్స్ కు చేరతాయి. ఇప్పటివరకు.. ఆయా జట్ల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
గుజరాత్ టైటాన్స్: డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఈ ఏడాది ప్రారంభం నుంచి మెుదటి స్థానంలో కొనసాగుతుంది.
ఇప్పటి వరకు 11 మ్యాచులాడి.. 8 విజయాలతో 16 పాయింట్లతో ముందుంది. ఈ జట్టు ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది.
ఈ మూడింటిలో ఓడిన పెద్దగా నష్టం ఉండదు. అయితే తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లకు క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది.
చెన్నై సూపర్ కింగ్స్: పాయింట్ల పట్టికలో.. చెన్నై రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇంకా చెన్నై రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది.
12 మ్యాచుల్లో ఏడు విజయాలు, నాలుగు ఓటములు, ఒక రద్దుతో ప్రస్తుతం చెన్నై ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి. యువ బౌలర్లతో చెన్నై అద్భుతంగా రాణిస్తోంది.
ముంబయి ఇండియన్స్: ఈ సీజన్ లో ముంబైది ప్రత్యేకమైన ఆటతీరు.
వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ముంబయి.. పుంజుకుని ప్లే ఆఫ్ రేసులోకి వచ్చింది. ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతుంది.
ప్రస్తుతం 11 మ్యాచులు ఆడిన ముంబయి.. ఆరు విజయాలు, ఐదు ఓటములతో 12 పాయింట్లతో ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్: ఆరంభంలో మంచి ప్రదర్శన చేసినా.. తర్వాత వరుస ఓటములతో తడబడింది.
మొత్తం 11 మ్యాచుల్లో ఐదు విజయాలు, ఐదు ఓటములు, ఒక మ్యాచ్ రద్దు కావడంతో 11 పాయింట్లతో ఉంది.
క్వింటన్ డికాక్, కేల్ మేయర్స్, పూరన్, స్టాయినిస్, ఆయుష్ బదోని ఫామ్‌లో ఉన్నారు.
రాజస్థాన్ రాయల్స్ : గతేడాది ఫైనల్ ఆడిన జట్టు. ఈ ఏడాది ఆడిన మెుదటి ఐదు మ్యాచుల్లో నాలుగింట విజయం.
కానీ వరుస ఓటములు ఈ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేశాయి.
గత ఆరు మ్యాచుల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసుకుంది. ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతుంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ : కొత్త కెప్టెన్ నితీశ్ రాణా నాయకత్వంలోని కోల్‌కతా గత రెండు మ్యాచుల్లో విజయం సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
అయితే, మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 11 మ్యాచుల్లో ఐదు విజయాలు, ఆరు ఓటములతో 10 పాయింట్లతో కొనసాగుతోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ప్రతిసారి ఈ జట్టును దురదృష్టం వెంటాడుతోంది. జట్టునిండా ప్లేయర్లు ఉన్న.. అదృష్టం కలసిరావడం లేదు.
ప్రస్తుతం 11 మ్యాచుల్లో ఐదు విజయాలు, ఆరు ఓటములతో 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. మిగిలిన మ్యాచుల్లో గెలిస్తేనే అవకాశాలు ఉంటాయి.
పంజాబ్ కింగ్స్ : ఆరంభంలో మంచి ప్రదర్శన చేసిన..తర్వాత తెలిపోయింది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో కిందికి దిగజారింది.
ఆరంభంలో కెప్టెన్ శిఖర్ ధావన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో రాణించాడు. ఆడిన 11 మ్యాచుల్లో కేవలం ఐదు విజయాలను మాత్రమే నమోదు చేసింది.
ప్రస్తుతం 10 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. దిల్లీతో రెండు మ్యాచ్‌లు, రాజస్థాన్‌తో ఒకసారి తలపడనుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ : ప్రస్తుతం 10 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి అట్టడుగు నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.
అయినా, ఇప్పటికీ సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆడాల్సిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే అప్పుడు హైదరాబాద్ 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు వెళ్లొచ్చు.
లఖ్‌నవూ, గుజరాత్, బెంగళూరు, ముంబయితో తలపడాల్సి ఉంది.
దిల్లీ క్యాపిటల్స్ : వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎప్పుడో నిష్క్రమించింది.
తర్వాత జరిగిన ఆరు మ్యాచుల్లో నాలుగు గెలిచినా ఫలితం మాత్రం శూన్యమే.
ప్రస్తుతం 11 మ్యాచుల్లో 4 విజయాలు, ఏడు ఓటములతో కేవలం 8 పాయింట్లతో చివరిస్థానంలో నిలిచింది.
దిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం దాదాపు అసాధ్యం. మిగతా మూడు మ్యాచుల్లోనూ గెలిచినా కష్టమే.