Last Updated:

IPL 2025: చెన్నై వర్సెస్ ముంబై.. బోణీ కొట్టిన చెన్నై

IPL 2025: చెన్నై వర్సెస్ ముంబై.. బోణీ కొట్టిన చెన్నై

Rachin, Ruturaj’s half-centuries Chennai beat Mumbai: ఐపీఎల్ 2025లో పరుగులు వరద కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడగా.. చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఆదివారం రాత్రి 7.30 నిమిషాలకు చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 4 వికెట్ల తేడాతో ముంబైను ఓడించింది.

 

తొలుత టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోగా.. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(0) డకౌట్ అయ్యాడు. రికిల్ టన్(13), విల్ జాక్స్(11), రాబిన్(3), నమన్ ధీర్(17), శాంట్నర్(11), బౌల్ట్(1) విఫలమవ్వగా.. సూర్యకుమార్(29), తిలక్ వర్మ(31), దీపక్ చాహర్(28) పర్వాలేదనిపించారు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు, నాథన్ ఎలీస్, అశ్విన్ చెరో వికెట్ తీశారు.

 

156 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన చెన్నై తొలుత తడబడింది. రెండో ఓవర్లలోనే ఓపెనర్ రాహుల్ త్రిపాఠి(2) ఔట్ అయ్యాడు. దీంతో చెన్నై 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. ఈ తరుణంలో మరో ఓపెనర్ రచిన్(65), రుతురాజ్ గైక్వాడ్(53) దూకుడుగా ఆడుతూ ఇన్నింగ్స్ స్కోరు వేగాన్ని పెంచారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. ఆ తర్వాత విఘ్రేశ్ బౌలింగ్‌లో రుతురాజ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత చెన్నై వరుసగా వికెట్లు కోల్పోయింది. శివమ్ దూబె(9), హుడా(3), సామ్ కరన్(4) ఔట్ అయ్యాడు. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన జడేజా(17)తో కలిసి రచిన్ నిలకడగా ఆడడంతో చెన్నై విజయం సాధించింది. ముంబై బౌలర్లలో విఘ్నేశ్ 3 వికెట్లు తీయగా.. దీపక్, జాక్స్ చెరో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి: