Home / క్రీడలు
వన్ డే క్రికెట్ లో డబల్ సెంచురీ అందరికి తెలిసిందే. టీ 20 క్రికెట్ లో కూడా సాధ్యమేనని నిరూపించాడు ఓ యువ ఆటగాడు. అతనే వెస్టిండీస్ చిచ్చర పిడుగు రకీం కార్నవాల్. అమెరికా వేదికగా టీ 20 టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అట్లాంటా ఓపెన్ లో ఫైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కార్నవాల్ ఆటలో చెలరేగాడు.
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పడు వన్డే సిరీస్‌పై కన్నేసింది.
IND vs SA 3rd T20 : సఫారీ దెబ్బకు టీమిండియా అబ్బా !
టీ20 ప్రపంచకప్‌కు దూరమవ్వడంపై జస్‌ప్రీత్ బుమ్రా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. మెగా టోర్నీ నుంచి తప్పుకోవడం పట్ల భావోద్వేగానికి గురయ్యాడు. తాను గాయం నుంచి కోలుకోవాలని కోరుకున్న పత్రీ ఒక్కరికి బుమ్రా ధన్యవాదాలు చెప్పారు. ఆస్ట్రేలియా వెళ్లి టీమిండియాకు మద్దతు తెలుపుతానంటూ ట్వీట్ చేశాడు.
IND vs SA : సొంత గడ్డ పై సిరీస్ ను సాధించిన టీమిండియా !
స్టేడియంలోనే 129 మంది మృతి చెందారు. దాదాపు మరో 180 మందికి పైగా గాయపడ్డారు. ఫుట్ బాల్ మైదానంలో ఇరుజట్ల ఫ్యాన్స్ మధ్య తీవ్ర రణరంగం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన ఇండోనేషియాలోని ఈస్ట్ జావాలో చోటుచేసుకుంది.
క్రికెట్ మ్యాచుల్లో గాయాలు కామన్. కాగా బ్యాటర్ల బాదుడు ధాటికి ఒక్కోసారి వికీలు, ఫీల్డర్లు, అంపైర్లు గాయపడుతుంటారు. కాగా ఇలాంటి సంఘటనే తాజాగా పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో చోటుచేసుకుంది. పాక్ బ్యాటర్ ఊపుడు దెబ్బకి లెగ్ అంపైర్ క్షతగాత్రుడు అయ్యాడు.
ఆస్ట్రేలియాలో జరిగే ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్ 2022లో విజేతకు $1.6 మిలియన్లు లేదా రూ. 13 కోట్ల చెక్కు ప్రైజ్ మనీగా దక్కుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ఐసిసి ) ఈ రోజు ప్రకటించింది.
టీమిండియాకు భారీ షాక్. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ 2022 నుంచి టీం ఇండియా స్టార్ క్రికెటర్ తప్పుకున్నాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. తీవ్రమైన వెన్ను నొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్‌లో పేస్ గుర్రం బుమ్రా ఆడడం లేదు.
నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో టీమిండియా, సౌత్ఆఫ్రికా ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా బోణి కొట్టింది. 107 పరుగుల లక్ష్యంతో బరి లోకి దిగినా టీమిండియా 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.16.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 110 పరుగులను చేసింది.