Last Updated:

MI VS LSG : కీలక పోరులో చేతులెత్తేసిన ముంబై.. విజయం సాధించిన లక్నో సూపర్ జెయింట్స్

ఐపీఎల్ 2023 లో భాగంగా లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన 63వ లీగ్ మ్యాచ్ లో  లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. లీగ్ మ్యాచ్ ల నుంచి ప్లే ఆఫ్స్ కి చేరువవుతున్న తరుణంలో కీలకంగా మారిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతులెత్తేసింది. లక్నో సూపర్ జెయింట్స్

MI VS LSG : కీలక పోరులో చేతులెత్తేసిన ముంబై.. విజయం సాధించిన లక్నో సూపర్ జెయింట్స్

MI VS LSG : ఐపీఎల్ 2023 లో భాగంగా లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన 63వ లీగ్ మ్యాచ్ లో  లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. లీగ్ మ్యాచ్ ల నుంచి ప్లే ఆఫ్స్ కి చేరువవుతున్న తరుణంలో కీలకంగా మారిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతులెత్తేసింది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. 178 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులే చేసింది. దాంతో 5 పరుగుల తేడాతో లక్నో సూపర్ విక్టరీ కొట్టింది.

లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఓపెనర్లు ఇషాన్ కిషన్ (59: 39 బంతుల్లో 8×4, 1×6), రోహిత్ శర్మ (37: 25 బంతుల్లో 1×4, 3×6) మెరుగైన ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కి 9.4 ఓవర్లలోనే ఈ జోడి 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కానీ.. రెండు ఓవర్ల వ్యవధిలోనే ఇద్దరూ ఔట్ అవ్వగా.. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (7), నేహాల్ వధీర (16), విష్ణు వినోద్ (2) ఫెయిలయ్యారు. కానీ టిమ్ డేవిడ్ (32 నాటౌట్: 19 బంతుల్లో 1×4, 3×6) ముంబైని గెలిపించేందుకు ప్రయత్నించాడు. చివరి 6 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన క్రమంలో క్రీజులో టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్ ఉండటంతో ముంబై  గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ లాస్ట్ ఓవర్ వేసిన మోసిన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కేవలం 5 పరుగులే ఇచ్చాడు. దాంతో లక్నో విజయం సాధించింది. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మోసిన్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.

Image

ఇక తొలుత బ్యాటింగ్ చేసిన లక్కో జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. లక్నో జట్టులో ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ చెలరేగిపోయాడు. పవర్ హిట్టింగ్ తో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లోనే 4 ఫోర్లు, 8 సిక్సులతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్టొయినిస్ విజృంభణతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసింది. అలానే కృనాల్ పాండ్యా 42 బంతుల్లో 49 పరుగులు చేసి రిటైర్ట్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఆఖర్లో స్టొయినిస్ రెచ్చిపోయాడు. స్టొయినిస్ ధాటికి చివరి 5 ఓవర్లలో లక్నో జట్టుకు 69 పరుగులు లభించాయి. ముంబై బౌలర్లలో జాసన్ బెహరెన్ డార్ఫ్ 2 వికెట్లు తీశాడు. పియూష్ చావ్లా ఒక వికెట్ పడగొట్టాడు.

ఈ విజయంతో  పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్  మూడో   స్థానానికి ఎగబాకింది. లక్నోకు 13 మ్యాచ్ లలో ఇది  7 వ విజయం. దీంతో ఆ జట్టు ఖాతాలో 15 పాయింట్లు చేరాయి. ఓటమితో ముంబై   నాలుగో స్థానానికి పరిమితమై  ప్లేఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ముంబై తర్వాత మ్యాచ్ లో గెలవడంతో పాటు నాలుగో స్థానం  కోసం పోటీ పడుతున్న  ఆర్సీబీ, పంజాబ్ జట్ల ఫలితాలపై ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. చూడాలి మరి ఏ ఏ జట్లు ప్లే ఆఫ్స్ కు చెరతాయో అని.