Last Updated:

SRH vs GT : ఐపీఎల్ లో ఫస్ట్ సెంచరీ కొట్టిన శుభ్‌మ‌న్.. స‌న్‌రైజ‌ర్స్ టార్గెట్ 189

ఐపీఎల్‌ 2023 లో భాగంగా ఈరోజు ( మే 15, 2023 ) న అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ల‌ప‌డడానికి సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి గుజ‌రాత్ త‌న అగ్ర‌స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకోవ‌డంతో పాటు ప్లే ఆఫ్స్ చేరిన మొద‌టి జ‌ట్టుగా నిల‌వాలని ఉంది. ఇక మరోవైపు ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ అవ‌కాశాల‌ను

SRH vs GT : ఐపీఎల్ లో ఫస్ట్ సెంచరీ కొట్టిన శుభ్‌మ‌న్.. స‌న్‌రైజ‌ర్స్ టార్గెట్ 189

SRH vs GT : ఐపీఎల్‌ 2023 లో భాగంగా ఈరోజు ( మే 15, 2023 ) న అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ల‌ప‌డడానికి సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి గుజ‌రాత్ త‌న అగ్ర‌స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకోవ‌డంతో పాటు ప్లే ఆఫ్స్ చేరిన మొద‌టి జ‌ట్టుగా నిల‌వాలని ఉంది. ఇక మరోవైపు ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ అవ‌కాశాల‌ను కష్టం చేసుకున్న చేసుకున్న హైద‌రాబాద్ కనుక ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ఇక ప్లే ఆఫస్ ఆశలు వదిలేసుకోవడమే.

సీజన్‌లో ఇప్పటికే 12 మ్యాచ్‌లాడిన గుజరాత్ టైటాన్స్ టీమ్ 8 మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో నెం.1 స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ 11 మ్యాచ్‌లాడి ఏకంగా 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దాంతో కేవలం 8 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో హైదరాబాద్ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ కి ఈ మ్యాచ్ గెలవడం చాలా అవసరం అని చెప్పాలి.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 15 May 2023 09:27 PM (IST)

    సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 189..

    గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. స‌న్ రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఐదు వికెట్లు తీయ‌గా, మార్కో జాన్సెన్, ఫరూఖీ, న‌ట‌రాజ‌న్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు. ఐపీఎల్‌తో గిల్ ఈ ఐపీఎల్ లో తన ఫస్ట్ సెంచరీని నమోదు చేయగా.. అతనికి సుద‌ర్శ‌న్‌ (47; 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) మంచి సపోర్ట్ ఇచ్చాడు.  ఇక మిగిలిన వారిలో హార్ధిక్ పాండ్యా(8), డేవిడ్ మిల్ల‌ర్‌(7), రాహుల్ తెవాటియా(3), వృద్దిమాన్ సాహా(0) లు విఫ‌లం అయ్యారు.

  • 15 May 2023 09:24 PM (IST)

    చివర్లో వరుస వికెట్లు కోల్పోయిన గుజరాత్.. ఒకే ఓవర్ లో నాలుగు

    సెంచరీ కొట్టిన గిల్.. భువనేశ్వర్ వేసిన 19 వ మొదటి బంతికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక రెండో బాల కి రషీద్ ఖాన్ కూడా కీపర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఇక మూడో బంతికి హ్యాట్రిక్ మిస్ అయినా కానీ రన్ ఔట్ రూపం లో అహ్మద్ వికెట్ చేజార్చుకున్నాడు. ఇక 19. 5 బాల్ కి షమి కూడా ఔట్ అయ్యాడు. దీంతో ఒకే ఓవర్ లో గుజరాత్ 4 వికెట్లు కోల్పోయింది.

  • 15 May 2023 09:14 PM (IST)

    ఐపీఎల్ లో ఫస్ట్ సెంచరీ కొట్టిన గిల్..

    శుబ్ మన్ గిల్ తన ఫామ్ ని కొనసాగిస్తూ ఐపీఎల్ లో తన మొదటి సెంచరీని నమోదు చేసుకున్నాడు. 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి టీమ్ కి మంచి సపోర్ట్ ఇచ్చాడు. వీటిలో 13 ఫోర్లు, 1 సిక్స్‌ ఉన్నాయి.

  • 15 May 2023 09:03 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్.. మిల్ల‌ర్ ఔట్‌

    గుజ‌రాత్ మ‌రో వికెట్ కోల్పోయింది. న‌ట‌రాజ‌న్ బౌలింగ్‌లో డేవిడ్ మిల్ల‌ర్‌(7) మార్‌క్ర‌మ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 169 ప‌రుగుల(16.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద గుజ‌రాత్ నాలుగో వికెట్ కోల్పోయింది.

  • 15 May 2023 08:57 PM (IST)

    స్వల్ప గ్యాప్ లో మరో వికెట్.. హార్దిక్ పాండ్యా ఔట్

    గుజ‌రాత్ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు వికెట్లు కోల్పోయింది. భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యా(8) రాహుల్ త్రిపాఠి చేతికి చిక్కాడు. దీంతో 156 ప‌రుగుల(15.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద గుజ‌రాత్ మూడో వికెట్ కోల్పోయింది.

  • 15 May 2023 08:53 PM (IST)

    సాయి సుద‌ర్శ‌న్ ఔట్‌

    గుజ‌రాత్ మ‌రో వికెట్ కోల్పోయింది. సాయి సుద‌ర్శ‌న్(47) ఔట్ అయ్యాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడ‌గా న‌ట‌రాజ‌న్ చేతికి చిక్కాడు. దీంతో 147 ప‌రుగుల(14.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద గుజ‌రాత్ రెండో వికెట్ కోల్పోయింది.

  • 15 May 2023 08:33 PM (IST)

    100 పరుగులు దాటిన గుజరాత్ స్కోర్..

    గుజరాత్ 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజులో శుభమన్ గిల్, సాయి సుదర్శన్ ఉన్నారు. ఇద్దరూ కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ భారీ టార్గెట్ ని నమోదు చేసేలా ఉన్నారు.

  • 15 May 2023 08:14 PM (IST)

    హాఫ్ సెంచరీతో చెలరేగిన గిల్.. బౌండరీలతో స్కోర్ బోర్డు పరుగులు

    మ్యాచ్ ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయినప్పటికీ,, గిల్ , సుదర్శన్ కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. వీరిద్దరూ కలిసి మంచి పార్ట్ నర్ షిప్ బిల్డ్ చేసి 8 ఓవర్లలో 89 - 1 పరుగులు రాబట్టారు.  సుదర్శన్ 23  (20 బంతుల్లో) , గిల్ 58 ( 26 బంతుల్లో )  చేసి ఐపీఎల్ లో మరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

  • 15 May 2023 07:38 PM (IST)

    రెండో బంతికే డకౌట్ అయిన సాహ..

    భువనేశ్వర్ వేసిన మొదటి ఓవర్ రెండో బంతికే సాహ ఔటయ్యాడు. ఖాతా తెరవకుండానే సాహ పెవిలియన్ బాట పట్టడం గుజరాత్ ఫ్యాన్స్ ని నిరాశ కలిగిస్తుంది

  • 15 May 2023 07:25 PM (IST)

    టాస్ గెలిచిన స‌న్‌రైజ‌ర్స్‌

    టాస్ గెలిచిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గుజ‌రాత్ ఇప్పుడు బ్యాటింగ్ కి రాబోతుంది.

  • 15 May 2023 07:22 PM (IST)

    సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జ‌ట్టు

    ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్‌), అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూఖీ, టి నటరాజన్

  • 15 May 2023 07:20 PM (IST)

    గుజరాత్ టైటాన్స్ తుది జ‌ట్టు..

    శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీప‌ర్‌), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, దసున్ షనక, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్