LSG Vs MI: స్టాయినిస్ విధ్వంసం.. ముంబయి లక్ష్యం 178 పరుగులు
LSG Vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్ లో భాగంగా 63వ లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముంబయి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
LSG Vs MI: లక్నో బ్యాటర్ స్టాయినిస్ విధ్వంసం సృష్టించాడు. 47 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఇందులో 8 సిక్సులు ఉన్నాయి. 20 ఓవర్లలో లక్నో 177 పరుగులు చేసింది. స్టాయినిస్ కి తోడుగా.. కృనాల్ 49 పరుగులతో రాణించాడు.
ముంబయి బౌలర్లలో జాసన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. పీయుష్ చావ్లా ఓ వికెట్ పడగొట్టాడు.
LIVE NEWS & UPDATES
-
LSG Vs MI:స్టాయినిస్ విధ్వంసం.. ముంబయి లక్ష్యం 178 పరుగులు
లక్నో బ్యాటర్ స్టాయినిస్ విధ్వంసం సృష్టించాడు. 47 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఇందులో 8 సిక్సులు ఉన్నాయి. 20 ఓవర్లలో లక్నో 177 పరుగులు చేసింది. స్టాయినిస్ కి తోడుగా.. కృనాల్ 49 పరుగులతో రాణించాడు.
ముంబయి బౌలర్లలో జాసన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. పీయుష్ చావ్లా ఓ వికెట్ పడగొట్టాడు.
-
LSG Vs MI: చెలరేగిన స్టాయినిస్.. ఒకే ఓవర్లో 24 పరుగులు
జోర్డాన్ వేసిన ఓవర్లో ఏకంగా 24 పరుగులు వచ్చాయి.
-
LSG Vs MI: స్టాయినిస్ అర్దసెంచరీ
స్టాయినిస్ అర్దసెంచరీతో చెలరేగాడు. 36 బంతుల్లో 51 పరుగులు చేశాడు.
-
LSG Vs MI: 17 ఓవర్లకు 116 పరుగులు
కృనాల్, స్టాయినిస్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. దీంతో 17 ఓవర్లకు లక్నో 116 పరుగులు చేసింది.
-
LSG Vs MI: వంద పరుగులు దాటిన లక్నో..
లక్నో అతికష్టం మీద 100 పరుగులు దాటింది. నాలుగో వికెట్ కు కృనాల్, స్టాయినిస్ 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు.
-
LSG Vs MI: 10 ఓవర్లకు 68 పరుగులు
10 ఓవర్లు ముగిసేసరికి లక్నో 68 పరుగులు చేసింది.
-
LSG Vs MI: మూడో వికెట్ డౌన్.. తక్కువ పరుగులే చేసిన డికాక్
క్వింటాన్ డికాక్ తక్కువ పరుగులకే ఔటయ్యాడు. పియూష్ చావ్లా తొలి బంతికే వికెట్ తీశాడు.
-
LSG Vs MI: ముగిసిన పవర్ ప్లే.. నెమ్మదిగా లక్నో బ్యాటింగ్
పవర్ ప్లే ముగిసేసరికి లక్నో.. కేవలం 35 పరుగులే చేయగలిగింది. ప్రస్తుతం క్రీజులో డూప్లెసిస్, కృనాల్ ఉన్నారు.
-
LSG Vs MI: ముగిసిన 4వ ఓవర్.. 23 పరుగులు చేసిన లక్నో
రెండు వికెట్లు పడటంతో లక్నో నిదానంగా బ్యాటింగ్ చేస్తోంది. ఆ జట్టు నాలుగు ఓవర్లకు కేవలం 23 పరుగులే చేసింది.
-
LSG Vs MI: రెండు బంతుల్లో రెండు వికెట్లు..
వరుస బంతుల్లో లక్నో రెండు వికెట్లు కోల్పోయింది. మన్ కడ్ డకౌట్ అయ్యాడు. దీంతో 12 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది.
-
LSG Vs MI: తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. హుడా ఔట్
లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. జాసన్ బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు.
-
LSG Vs MI: తొలి ఓవర్.. కేవలం మూడు పరుగులే
జాసన్ వేసిన తొలి ఓవర్లో కేవలం మూడు పరుగులే వచ్చాయి.
-
LSG Vs MI: ముంబయి జట్టు ఇదే
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, క్రిస్ జోర్డాన్, పీయూశ్ చావ్లా, జాసన్, ఆకాశ్
-
LSG Vs MI: లక్నో బ్యాటింగ్.. జట్టు ఇదే
క్వింటన్ డి కాక్, దీపక్ హూడా, ప్రేరక్ మన్కడ్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుశ్ బడోని, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, స్వప్నిల్ సింగ్, మోహ్సిన్ ఖాన్
-
LSG Vs MI: టాస్ గెలిచిన ముంబయి..
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.