Published On:

IPL 2025 30th Match: చెన్నైతో లక్నో ఢీ.. ఓడితే ఇంటికే!

IPL 2025 30th Match: చెన్నైతో లక్నో ఢీ.. ఓడితే ఇంటికే!

Lucknow Super Giants Vs Chennai Super Kings in IPL 2025 30th Match: ఐపీఎల్ 2025లో భాగంగా ఈ సీజన్‌లో ఇవాళ 30వ మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా లక్నో సూపర్ జాయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 నిమిషాలకు జరగనుంది. అయితే ఈ సీజన్‌లో చెన్నై 6 మ్యాచ్‌లు ఆడితే 5 మ్యాచ్‌ల్లో ఓటమి చెందగా.. ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. లక్నో విషయానికొస్తే.. ఆడిన 6 మ్యాచ్‌ల్లో నాలుగింట్లో గెలుపొందగా.. 2 మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. ఇక, పాయింట్ల పట్టికలో లక్నో 4వ స్థానంలో ఉండగా.. చెన్నై 10వ స్థానంలో కొనసాగుతోంది.

 

అయితే, ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌లు జరగగా.. లక్నో మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఓ మ్యాచ్‌లో చెన్నై గెలుపొందగా.. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. కాగా, లక్నో కీలక ప్లేయర్ మిచెల్ మార్ష్ తిరిగి అందుబాటులోకి వచ్చాడు. అంతకుముందు మ్యాచ్‌కు కూతురి అనారోగ్యం కారణంగా ఆడలేదు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఈ సీజన్‌లో చెన్నై ఆరు మ్యాచుల్లో 5 ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరిలో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడితే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకున్నట్లేనని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: