KKR vs SRH: సన్ రైజర్స్ భారీ స్కోర్.. కోల్ కతా లక్ష్యం 229 పరుగులు
KKR vs SRH: ఐపీఎల్ 16వ సీజన్‌లో మరో కీలక పోరుకు ఈడెన్ గార్డెన్స్ వేదికైంది. ఈ మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో విజయంతో ఊపు మీదున్న సన్‌రైజర్స్ అదే జోరును కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
KKR vs SRH: సన్ రైజర్స్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. హరీ బ్రూక్ సెంచరీతో చెలరేగాడు. 55 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. మక్రామ్ 50 పరుగులు చేయగా.. అభిషేక్ శర్మ 32 పరుగులతో రాణించాడు.
కోల్ కతా బౌలర్లలో రస్సెల్ 3 వికెట్లు తీయగా.. చక్రవర్తి ఒక వికెట్ తీసుకున్నాడు.
LIVE NEWS & UPDATES
-
KKR vs SRH: సన్ రైజర్స్ భారీ స్కోర్.. కోల్ కతా లక్ష్యం 229 పరుగులు
సన్ రైజర్స్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. హరీ బ్రూక్ సెంచరీతో చెలరేగాడు. 55 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. మక్రామ్ 50 పరుగులు చేయగా.. అభిషేక్ శర్మ 32 పరుగులతో రాణించాడు.
కోల్ కతా బౌలర్లలో రస్సెల్ 3 వికెట్లు తీయగా.. చక్రవర్తి ఒక వికెట్ తీసుకున్నాడు.
-
KKR vs SRH: పరుగులు వరద.. 18 ఓవర్లకే 200 పరుగులు
సన్ రైజర్స్ బ్యాటర్లు చుక్కలు చూపిస్తున్నారు. 18 ఓవర్లకే జట్టు స్కోర్ 200 చేరింది. హరీ బ్రూక్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. అభిషేక్ శర్మ 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు.
-
KKR vs SRH: 16 ఓవర్.. 15 పరుగులు చేసిన సన్ రైజర్స్
17 ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ 172 పరుగులు చేసింది.
-
KKR vs SRH: 15 ఓవర్లో 23 పరుగులు.. రెచ్చిపోతున్న హరీ బ్రూక్
సన్ రైజర్స్ బ్యాటింగ్ లో దుమ్ములేపుతుంది. 15 ఓవర్లకు 157 పరుగులు చేసింది. హరీ బ్రూక్ చెలరేగిపోతున్నాడు. 43 బంతుల్లో 77 పరుగులు చేశాడు.
-
KKR vs SRH: మక్రామ్ విధ్వంసం.. 26 బంతుల్లో 50 పరుగులు
సన్ రైజర్స్ కెప్టెన్ మక్రామ్ విధ్వంసం సృష్టించాడు. 26 బంతుల్లో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇందులో 5సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి.
-
KKR vs SRH: ముగిసిన 12వ ఓవర్.. మరో రెండు సిక్సులు
12 ఓవర్లో 16 వచ్చాయి. యూషాష్ వేసిన బౌలింగ్ లో మక్రామ్ రెండు సిక్సులు, ఓ ఫోర్ కొట్టాడు. దీంతో మెుత్తం 16 పరుగులు వచ్చాయి.
-
KKR vs SRH: హరీ బ్రూక్ అర్దసెంచరీ.. ఐదు ఫోర్లు, 2 సిక్సులు
హరీ బ్రూక్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.
-
KKR vs SRH: ముగిసిన పదో ఓవర్.. చివరి బంతికి సిక్స్
10 ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ 94 పరుగులు చేసింది. యూషాష్ వేసిన బౌలింగ్ లో చివరి బంతికి మక్రామ్ సిక్స్ బాదాడు.
-
KKR vs SRH: ముగిసిన ఏడో ఓవర్.. సిక్సర్ బాదిన మక్రామ్
రస్సెల్ వేసిన ఏడో ఓవర్లో.. 10 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో మక్రామ్ భారీ సిక్సర్ బాదాడు. సన్ రైజర్స్ 75 పరుగులు చేసింది.
-
KKR vs SRH: ముగిసిన పవర్ ప్లే.. 65 పరుగులకు రెండు వికెట్లు
పవర్ ప్లే ముగిసేసరికి సన్ రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హరీ బ్రూక్.. మక్రామ్ ఉన్నారు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ పవర్ ప్లే లో అత్యధిక పరుగులు చేసింది.
-
KKR vs SRH: ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. రాహుల్ త్రిపాఠి ఔట్
సన్ రైజర్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. మెుదటి బంతికి అగర్వాల్ ఔటవ్వగా.. చివరి బంతికి త్రిపాఠి కూడా కీపర్ క్యాచ్ ఔటయ్యాడు.
-
KKR vs SRH: తొలి వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్.. అగర్వాల్ ఔట్
సన్ రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. రస్సెల్ వేసిన బౌలింగ్ లో మెుదటి స్లిప్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. అగర్వాల్ 13 బంతుల్లో 9 పరుగులు చేశాడు.
-
KKR vs SRH: నాలుగో ఓవర్.. కేవలం మూడు పరుగులే
సునీల్ నరైన్ వేసిన నాలుగో ఓవర్లో కేవలం మూడు పరుగులు మాత్రమే వచ్చాయి.
-
KKR vs SRH: మూడో ఓవర్.. వరుసగా రెండు సిక్సులు
ఉమేష్ యాదవ్ వేసిన ఓవర్లో భారీగా పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో బ్రూక్ వరుసగా రెండు సిక్సులు కొట్టాడు. మూడు ఓవర్లకు సన్ రైజర్స్ 43 పరుగులు చేసింది.
-
KKR vs SRH: రెండో ఓవర్.. 28 పరుగులు చేసిన సన్ రైజర్స్
ఫెర్గుసన్ వేసిన రెండో ఓవర్లో మరో 14 పరుగులు వచ్చాయి. ఇందులో వైడ్ రూపంలో ఐదు పరుగులు వచ్చాయి. హరీ బ్రూక్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు.
-
KKR vs SRH: తొలి ఓవర్.. 14 పరుగులు చేసిన సన్ రైజర్స్
తొలి ఓవర్ వేసిన ఉమేష్ యాదవ్ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. హరీ బ్రూక్ మూడు ఫోర్లు కొట్టాడు.
-
KKR vs SRH: క్రీజులోకి హారీ బ్రూక్.. అగర్వాల్
క్రీజులోకి హరీ బ్రూక్.. మయాంక్ అగర్వాల్ వచ్చారు.
-
KKR vs SRH: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా.. జట్టు ఇదే
కోల్‌కతా: జాసన్ రాయ్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా (కెప్టెన్), ఆండ్రూ రస్సెల్, రింకు సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
-
KKR vs SRH: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా.. హైదరాబాద్ జట్టు ఇదే
హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐదెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మయాంక్ మార్కండే, మార్కో జాన్‌సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్