Last Updated:

MI vs GT : మెరుపు సెంచరీతో ముంబైకి విక్టరీ కట్టబెట్టిన సూర్య కుమార్ యాదవ్.. రషీద్ ఖాన్ పోరాటం వృధా !

ఐపీఎల్ 2023 లో భాగంగా ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్ 218 పరుగులు చేయగా.. టార్గెట్ ని ఛేజ్ చేసే క్రమంలో ఛేదనలో తడబడిన గుజరాత్ టీమ్ 191/8కి పరిమితమైంది. దీంతో సొంత మైదానంలో గుజ‌రాత్ టైటాన్స్‌ తో జ‌రిగిన

MI vs GT : మెరుపు సెంచరీతో ముంబైకి విక్టరీ కట్టబెట్టిన సూర్య కుమార్ యాదవ్.. రషీద్ ఖాన్ పోరాటం వృధా !

MI vs GT : ఐపీఎల్ 2023 లో భాగంగా ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్ 218 పరుగులు చేయగా.. టార్గెట్ ని ఛేజ్ చేసే క్రమంలో ఛేదనలో తడబడిన గుజరాత్ టీమ్ 191/8కి పరిమితమైంది. దీంతో సొంత మైదానంలో గుజ‌రాత్ టైటాన్స్‌ తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇక ఈ విజయంతో ముంబై ప్లే ఆఫ్స్ కు మ‌రింత చేరువైంది.

ముంబై ఇచ్చిన భారీ టార్గెట్ ని చేధించే క్రమంలో గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 191 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్లు శుభమన్ గిల్ (6), సాహా (2)తో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్య (4) కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. ఇక ఆ తర్వాత వచ్చిన  విజయ్ శంకర్ (29: 14 బంతుల్లో 6×4), డేవిడ్ మిల్లర్ (41: 26 బంతుల్లో 4×4, 2×6) మ్యాచ్ ని కాపాడే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ వికెట్లు పడకుండా గుజరాత్ కి మంచి సపోర్ట్ ఇచ్చినప్పటికీ చేయాల్సిన పరుగులకు , మిగిలిన బంతులకు బాగా గ్యాప్ వచ్చింది. దీంతో ధాటిగా ఆడే క్రమంలో వీరిద్దరూ వికెట్లు చేజార్చుకోవాల్సి వచ్చింది. మిగిలిన బ్యాట్స్ మెన్ లలో రాహుల్ తెవాటియా (14) అభినవ్ మనోహర్ (2) కూడా చేతులెత్తేశారు. కానీ చివర్లో రషీద్ ఖాన్ (79 నాటౌట్: 32 బంతుల్లో 3×4, 10×6) తో చెలరేగి ముంబై బౌలర్లని ఉతికారేసి అజేయంగా నిలిచాడు.

ర‌షీద్ ఖాన్ సిక్స‌ర్ల వ‌ర్షం..

గుజరాత్ టీం ఓ వైపు వికెట్లు కోల్పోయి మ్యాచ్ ముంబై చేతుల్లోకి వెళ్ళిపోయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ ఊర కొట్టుడు కొట్టాడు. బౌలర్ ఎవరు అనేది చూసుకోకుండా మెరుపు ఇన్నింగ్స్ ఆది ముంబై కి ఒక దశలో వణుకు పుట్టించేశాడు. 103 ప‌రుగుల‌కే 8 వికెట్లు కోల్పోయిన గుజ‌రాత్.. ర‌షీద్ విధ్వంసంతో 191 ప‌రుగులు చేసింది. అయితే భారీ ల‌క్ష్యం కావ‌డం.. మరోవైపు సపోర్ట్ ఇచ్చే బ్యాట్స్ మెన్ లేకపోవడంతో గుజ‌రాత్ ని విజయ తీరాలకు చేర్చలేకపోయడు.  ముంబై బౌల‌ర్ల‌లో ఆకాష్ మధ్వల్ మూడు వికెట్లు తీయ‌గా పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ చెరో రెండు వికెట్లు, బెహ్రెన్ డార్ఫ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

Image

ఐపీఎల్ లో ఫస్ట్ సెంచరీ కొట్టిన సూర్య (MI vs GT)..

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబైకి  ఓపెనర్లు రోహిత్ శర్మ (29 ; 18 బంతుల్లో.. 2 సిక్సర్లు, 3 ఫోర్లు), ఇషాన్ కిష‌న్‌ (31; 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) లు మెరుగైన ఆరంభమే ఇచ్చారు. ఇద్దరూ కలిసి ఫస్ట్ వికెట్ కు  6.1 ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. ఇటీవల వరుసగా విఫలమవుతున్న రోహిత్.. ఈ మ్యాచ్ లో ఫర్వాలేదనిపించాడు. ఇక వీరు ఔట్ అయ్యాక.. వచ్చిన సూర్య‌ కుమార్ యాద‌వ్ 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స‌ర్లతో 103 ప‌రుగులతో అజేయంగా నిలిచాడు. మొదట్లో నెమ్మడిగానే ఇన్నింగ్స్ ఆడిగా సూర్య 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత గేర్ మార్చిన  స్కై చెలరేగి హై స్పీడ్ లో 100 కొట్టేశాడు. దీంతో ముంబై భారీ టార్గెట్ ఇవ్వగలిగింది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ నాలుగు వికెట్లు తీయ‌గా మోహిత్ శ‌ర్మ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. సీజన్‌లో 12వ మ్యాచ్ ఆడిన ముంబయికి ఇది ఏడో గెలుపుకాగా.. పాయింట్ల పట్టికలోనూ మూడో స్థానానికి ఆ జట్టు ఎగబాకింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ నాలుగో మ్యాచ్‌లో ఓడినా పట్టికలో నెం.1 స్థానాన్ని నిలుపుకోగలిగింది. ఏప్రిల్ 25న అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయిని 55 పరుగుల తేడాతో గుజరాత్ ఓడించిన విషయం తెలిసిందే.