IPL 2025 : బోణీ కొట్టిన ఎస్‌ఆర్‌హెచ్

IPL 2025 : 287 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ల పోరాటం సరిపోలేదు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు కీలక వికెట్లు తీశారు. దీంతో ఆర్ఆర్ 242/6కే పరిమితమైంది. దీంతో విక్టరీ సాధించిన హైదరాబాద్ విజయాల బోణీ కొట్టింది. రాజస్థాన్ బ్యాటర్లు శాంసన్ (66), జురెల్ (70) అర్ధ శతకాలు వృథా అయ్యాయి. హైదరాబాద్ బౌలర్లలో సిమర్జీత్, హర్షల్ చెరో రెండు వికెట్లు తీశారు. షమీ, జంపా హర్షల్ ఒక్కో వికెట్ తీశారు.
మొదటగా బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు విజృంభించారు. ఇషాన్ 45 బంతుల్లో సెంచరీ కొట్టాడు. హెడ్ (67), నితీష్ (30), క్లాసన్ (34), అభిషేక్ (24) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో తీక్షణ 2 వికెట్లు తీయగా, సందీప్ 1, దేశ్‌పాండే మూడు వికెట్లు పడగొట్టాడు.