Published On:

IPL 2023 KKR vs PBKS: కేకేఆర్ కు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించిన పంజాబ్

ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్.. మరో వైపు టాప్ 4 లో ప్లేస్ లక్ష్యంగా పంజాబ్ కింగ్స్ ఈడెన్ గార్డెన్ వేదికగా ఢీ కొట్టబోతున్నాయి.

IPL 2023 KKR vs PBKS: కేకేఆర్ కు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించిన పంజాబ్

IPL 2023 KKR vs PBKS: తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. దీంతో కోల్ కతా కు 180 పరుగలు భారీ లక్ష్యాన్ని ఇచ్చారు. పంజాబ్ బ్యాటర్లో శిఖర్ ధావన్ 57 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో షారుఖ్ ఖాన్ (21), హర్ ప్రీత్ బ్రార్ (17) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసుకున్నాడు. హర్షిత్ రాణా 2, సుయాష్ శర్మ, నితీశ్ రాణా తలో ఒక్క వికెట్ సాధించారు.

 

 

తుది జట్లు(IPL 2023 KKR vs PBKS)

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), భానుక రాజపక్స, లియామ్ లివింగ్ స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కరాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషీ ధావన్, రాహుల్ చహర్, అర్షదీప్ సింగ్

ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్లు: నాథన్ ఎల్లిస్, అథర్వ తైడే, మోహిత్ రాథీ, మాథ్యూ షార్ట్, సికిందర్ రజా

కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాబ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, శార్ధూల్ థాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి

ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్లు: జేసన్ రాయ్, నారాయణ్ జగదీశన్, ఫెర్గూసన్, కుల్వంత్, అనుకుల్ రాయ్

 

 

The liveblog has ended.
No liveblog updates yet.

LIVE NEWS & UPDATES