Last Updated:

Food delivery: స్విగ్గీ, జొమాటోలకు చెక్ పెడుతున్న ONDC

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అనగానే గుర్తేచ్చేవి స్వీగ్గీ, జుమాటో. వాటి మధ్య కాంపిటేషన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫామ్స్ కి ఉన్న కాంపిటేషన్ వల్ల వేరే ఇతర కంపెనీలు

Food delivery: స్విగ్గీ, జొమాటోలకు చెక్ పెడుతున్న ONDC

Food delivery: ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అనగానే గుర్తేచ్చేవి స్వీగ్గీ, జుమాటో. వాటి మధ్య కాంపిటేషన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫామ్స్ కి ఉన్న కాంపిటేషన్ వల్ల వేరే ఇతర కంపెనీలు వచ్చినా నిలవలేకపోతున్నాయి. తమ దైన ఆఫర్లతో ఈ రెండు కంపెనీలు వినియోగదారులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇంత పాపులారిటీ ఉన్న ఈ కంపెనీలకు ఓ ప్రభుత్వ ఈ కామర్స్ ఫామ్ సవాల్ గట్టి పోటీ ఇస్తోంది. ‘ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్’ (ONDC) లో అతి తక్కువ ధరకే ఫుడ్ లభించడంతో.. యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పలువురు స్క్రీన్ షాట్లు తీసి పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా ఫుడ్ విభాగంలో డెలివరీల సంఖ్య 10 వేల స్థాయిని అందుకుంది.

 

ధరలను పోలుస్తూ స్క్రీన్‌ షాట్లు( Food delivery)

ఇప్పటివరకు ఇ-కామర్స్‌ విభాగంలో ఆధిపత్యాన్ని చెక్‌పెట్టేందుకు ONDC ని ప్రభుత్వం లాంచ్‌ చేసింది. థర్డ్‌ పార్టీ యాప్స్‌తో ఎలాంటి సంబంధం లేకుండా ఎవరైనా సరే ఈ వేదికపై ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. యూజర్లు సైతం ఈ ఫ్లాట్ ఫామ్ లో కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ సహా 240 కి పైగా నగరాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులో తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే ఫుడ్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో టాక్ రావడంతో గత కొన్ని రోజులుగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. మామూలుగా రెస్టారెంట్లకు, హోటళ్లకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే ఫుడ్ ధరలకు, ఫుడ్‌ డెలివరీ యాప్స్‌లో ఉండే ధరలకు చాలా తేడా ఉంటుంది. దీనికి డెలివరీ ఛార్జీలు కూడా అదనంగా వసూలు చేస్తాయి. ఈ నేపథ్యంలో కొందరు యూజర్లు స్విగ్గీ, జొమాటోలో లభించే ఆహారానికి, ఓఎన్‌డీసీ వేదికలో ఆహార పదార్థాల ధరలతో పోలుస్తూ స్క్రీన్‌ షాట్లు పోస్ట్‌ చేస్తున్నారు.

 

Will ONDC drive Swiggy and Zomato Out of Business? - Dailybulls

ఆర్డర్‌ ఎలా పెట్టుకోవాలంటే..

స్విగ్గీ, జొమాటో మాదిరి గానే ONDCకి ప్రత్యేకంగా యాప్‌ ఏమీలేదు. మనకు కావాలనుకున్న వస్తువు కోసం బయ్యర్‌ యాప్స్‌లోకి వెళ్లి డైరెక్ట్ కొనుగోలు చేయాలి. పేటీఎం, మైస్టోర్‌, పిన్‌కోడ్‌, స్పైస్‌ మనీ లాంటి యాప్స్‌ ప్రస్తుతం బయ్యర్‌ యాప్స్‌గా ఉన్నాయి. పేటీఎంలోకి వెళ్లి ONDC అని సెర్చ్‌ చేయాలి. ఆ తర్వాత ఫుడ్ క్యాటగిరీలో నచ్చిన ఆహరాన్ని ఆర్డర్‌ పెట్టుకోవచ్చు. అయితే, ఓఎన్‌డీసీ కొత్తది కావడం వల్ల అన్ని రెస్టారెంట్లు, అన్ని పిన్‌కోడ్స్‌లో అందుబాటులో ఉండకపోవచ్చు. భవిష్యత్‌లో ఈ సేవలు మరింత పెంచే అవకాశం ఉంది.