Last Updated:

CSK: టాప్‌ లేపిన చెన్నై.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం

CSK:చెన్నై దూసుకుపోతుంది. ఇటు బ్యాటింగ్ లో అటూ బౌలింగ్ లో రెచ్చిపోతుంది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో కోల్‌కతాను మట్టికరిపిస్తూ ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ విజయం సాధించింది.

CSK: టాప్‌ లేపిన చెన్నై.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం

CSK: ఐపీఎల్ లో చెన్నై దుమ్ము లేపుతోంది. వరుసగా మూడో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వెళ్లింది. రహానే విధ్వంసం.. సమిష్టి బౌలింగ్ తో కోల్ కతా నైట్ రైడర్స్ పై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు.. కోల్ కతా వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది.

రెచ్చిపోయిన రహానె, దూబె (CSK)

ఐపీఎల్ లో చెన్నై దుమ్ము లేపుతోంది. వరుసగా మూడో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వెళ్లింది.

రహానే విధ్వంసం.. సమిష్టి బౌలింగ్ తో కోల్ కతా నైట్ రైడర్స్ పై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరోవైపు.. కోల్ కతా వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది.

చెన్నై దూసుకుపోతుంది. ఇటు బ్యాటింగ్ లో అటూ బౌలింగ్ లో రెచ్చిపోతుంది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో కోల్‌కతాను మట్టికరిపిస్తూ ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ విజయం సాధించింది.

రహానే విధ్వంసం.. శివం దూబే చెలరేగడంతో చెన్నై భారీ స్కోర్ సాధించింది. ఛేదనలో తడబడిన కోల్ కతా 186 పరుగులే చేయగలిగింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన చెన్నై భారీ స్కోర్ సాధించింది. రహానె (71 నాటౌట్‌; 29 బంతుల్లో 6×4, 5×6), శివమ్‌ దూబె (50; 21 బంతుల్లో 2×4, 5×6), కాన్వే (56; 40 బంతుల్లో 4×4, 3×6)

మెరవడంతో మొదట చెన్నై 4 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఆ తర్వాత జేసన్‌ రాయ్‌ (61; 26 బంతుల్లో 5×4, 5×6), రింకూ సింగ్‌ (53 నాటౌట్‌; 33 బంతుల్లో 3×4, 4×6)

గట్టి ప్రయత్నమే చేసినా ఛేదనలో కోల్‌కతా 8 వికెట్లకు 186 పరుగులే చేయగలిగింది.

జేసన్‌ రాయ్ మెరుపులు..

ఒక్క పరుగుకే రెండు వికెట్లు.. కాసేపటికి 46 పరుగులకు మూడు వికెట్లు ఇది కోల్ కతా పరిస్థితి. అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్‌ 15. ఇక కోల్ కతా పని అయిపోయింది అనుకున్నారు.

కానీ జేసన్ రాయ్ వీరబాదుడతో కోల్‌కతాను రేసులో నిలిపాడు. ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లు బాదడంతో ఆ జట్టు 14.2 ఓవర్లలో 135/4తో చెన్నైని కలరవర పెట్టింది.

అయితే తీక్షణ అతడి ఇన్నింగ్స్‌కు తెరదించాడు. రాయ్‌ ఔటైనా.. రింకూ రసెల్‌ క్రీజులో ఉండడంతో.. ఆశలు చిగురించాయి.

కానీ 17వ ఓవర్లో రసెల్‌ను ఔటవ్వడంతో కోల్ కతా పని అయిపోయింది.