Last Updated:

RCB vs RR: ఉత్కంఠపోరులో రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం

RCB vs RR: తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులకు పరిమితమైంది.

RCB vs RR: ఉత్కంఠపోరులో రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం

RCB vs RR: హోం గ్రౌండ్ లో జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ పై 7 పరుగుల తేడాతో గెలిచింది. బ్యాటింగ్ లో అదరగొట్టిన కోహ్లీ సేన.. బౌలింగ్ లోను రాణించింది.

 

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులకు పరిమితమైంది. యశస్వి జైస్వాల్ దేవదత్‌ పడిక్కల్ ధ్రువ్‌ జురెల్‌ రాణించినా ఫలితం లేకుండా పోయింది. ఇక బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు, సిరాజ్‌, డేవిడ్‌ విల్లీ ఒక్కో వికెట్ పడగొట్టారు.

తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. మ్యాక్స్ వెల్, డు ప్లెసిస్ భారీ స్కోర్లు చేశారు. ఒకానొక దశలో ఆర్సీబీ సులువుగా 220 స్కోరు సాధించేలా కనిపించింది. కానీ, మ్యాక్స్‌వెల్, డు ప్లెసిస్ వరుస ఓవర్లలో ఔట్ కావడంతో బెంగళూరు ఇన్నింగ్స్‌ గాడితప్పింది. చివరి ఏడు ఓవర్లలో ఆర్సీబీ.. 7 వికెట్లు కోల్పోయి 54 పరుగులే చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, సందీప్‌ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్‌, చాహల్ ఒక్కో వికెట్ తీశారు.

కోహ్లీ చెత్త రికార్డు (RCB vs RR)

ఐపీఎల్‌ 2023 లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్, రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడింది.

చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన  మ్యాచ్‌లో ఆర్సీబీ స్టాండిన్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు.

రాజస్థాన్ బౌలర్ బౌల్ట్‌ బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్బీగా కోహ్లీకి వెనుదిరిగాడు.

అయితే సొంతమైదానంలో ఆర్సీబీ ఆడుతుండటంతో.. అప్పటివరకు చిన్న స్వామి స్టేడియం కోహ్లి నామస్మరణతో హోరెత్తింది.

ఈ క్రమంలో ఆశ్చర్యకరంగా కోహ్లి ఔట్‌ అవడంతో స్టేడియమంతా ఒక్కసారిగా మూగబోయింది.

అంతేకాకుండా తాను డకౌట్ అవ్వడంతో తీవ్ర నిరాశ చెందిన కోహ్లి కూడా కనీసం నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న డుప్లెసిస్‌ను కూడా చూడకుండా పెవిలియన్ కు వెళ్లిపోయాడు.

చెత్త రికార్డు నమోదు

అయితే కోహ్లీ ఐపీఎల్‌లో ఒక చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు గోల్డెన్‌ డకౌట్‌ అయిన వారి లిస్ట్ లో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.

రాజస్థాన్ మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్ తో కలిపి కోహ్లీ 7సార్లు గోల్డెన్‌డక్‌ అవ్వగా.. సునీల్‌ నరైన్‌, హర్బజన్‌ సింగ్‌లతో కలిసి కోహ్లి సంయుక్తంగా ఉన్నాడు.

ఇక ఈ లిస్ట్ లో తొలి స్థానంలో గుజరాత్‌ టైటాన్స్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ 10 గోల్డెన్‌ డకౌట్లతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు.

కాగా, విరాట్ కోహ్లీకి ఏప్రిల్ 23 కలిసిరాని రోజుగా మిగిలిపోనుంది. ఎందుకంటే ఇదే ఆర్సీపీ తరపున కోహ్లీ ఆడిన 3 మ్యాచుల్లో గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు.

అంతేకాకుండా కోహ్లీ గోల్డెన్ డక్ అయిన 2 సందర్బాల్లో ఆర్సీబీ కి ఓటమి పాలైంది.