Last Updated:

HCA: టికెట్లు బ్లాక్‌లో అమ్మారనే ప్రచారం అవాస్తవం.. అజారుద్దీన్

భారత్ - ఆసీస్ మ్యాచ్ టికెట్లు బ్లాక్‌లో అమ్మారనే ప్రచారం అవాస్తవని అజారుద్దీన్ అన్నారు. టికెట్ల విక్రయంలో హెచ్ సి ఎ ఎలాంటి తప్పు చేయలేదని, ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మితే బ్లాక్‌లో విక్రయం ఎలా సాధ్యం అవుద్దని ప్రశ్నించారు.

HCA: టికెట్లు బ్లాక్‌లో అమ్మారనే ప్రచారం అవాస్తవం.. అజారుద్దీన్

Hyderabad: భారత్-ఆసీస్ మ్యాచ్ టికెట్లు బ్లాక్‌లో అమ్మారనే ప్రచారం అవాస్తవని అజారుద్దీన్ అన్నారు. టికెట్ల విక్రయంలో హెచ్ సి ఎ ఎలాంటి తప్పు చేయలేదని, ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మితే బ్లాక్‌లో విక్రయం ఎలా సాధ్యం అవుద్దని ప్రశ్నించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా టికెట్ల విక్రయ వివరాలను అజారుద్దీన్ వెల్లడించారు.

జింఖానా గ్రౌండ్స్‌లో నిన్న జరిగిన ఘటనకు చాలా బాధపడుతున్నామని అన్నారు. కాంప్లిమెంటరీ టికెట్లు ఎక్కువే ఇచ్చామని, టికెట్లు ఎలా విక్రయించామనే దానిపై అన్ని వివరాలు ఇచ్చామని తెలిపారు. టికెట్ల విక్రయాన్ని పేటీఎంకు అప్పగించామని, మ్యాచ్ ఏర్పాట్ల పైనే మేం పూర్తి దృష్టి సారించామని చెప్పారు. మ్యాచ్ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, తొక్కిసలాటలో తన తప్పుంటే అరెస్ట్ చేయవచ్చని పేర్కొన్నారు. అన్నీ సజావుగా నిర్వహిస్తున్నాం. టికెట్ల విక్రయాల్లో హెచ్‌సీ‌ఏ నుంచి ఏ పొరపాటు జరగలేదు. బ్లాక్‌లో టికెట్లు అమ్ముకోలేదు. అలా అమ్మేవారి పై కఠినంగా వ్యవహరిస్తాం. కాంప్లిమెంటరీ పాసులు ఎవరికి ఇవ్వలేదు. డైరెక్ట్ కార్పొరేట్‌ టికెట్లు 6వేల దాకా ఉన్నాయి. 11,500 టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించాం. జింఖానా దగ్గర ఏం జరిగిందో పోలీసులకు తెలుసు. ఆ బాధ్యత అంతా వారే చూసుకోవాలి. గాయపడిన వారికి వైద్య ఖర్చులు మేం భరిస్తాం. సుప్రీంకోర్టు కమిటీకి మేం జవాబుదారులం అని అజారుద్దీన్ పేర్కొన్నారు.

మ్యాచ్‌కు పూర్తిగా సిద్ధమయ్యామని, మ్యాచ్ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అజారుద్దీన్ తెలిపారు. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో మ్యాచ్ జరుగుతోందని, భారత జట్టులో అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారని చెప్పారు. ఆసీస్ మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతుందని భావిస్తున్నామన్నారు. టికెట్ల విక్రయం పై దుష్ప్రచారం జరుగుతోందని అజారుద్దీన్ అసహనం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి: