Last Updated:

Team India: భారత జట్టుకు క్వాలిటీ లేని ఫుడ్.. మండిపడుతున్న రోహిత్ సేన

టీ20 వరల్డ్ కప్‌ ప్రయాణంలో టీం ఇండియా విజయారంభం చేసింది. పాకిస్థాన్‌పై విజయంతో టీమిండియా వరల్డ్ కప్ మ్యాచ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రాక్టీస్ సెషన్‌లో ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఫుడ్‌ సరిగాలేదంటూ టీమిండియా ఆటగాళ్లు ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Team India: భారత జట్టుకు క్వాలిటీ లేని ఫుడ్.. మండిపడుతున్న రోహిత్ సేన

Team India: టీ20 వరల్డ్ కప్‌ ప్రయాణంలో టీం ఇండియా విజయారంభం చేసింది. పాకిస్థాన్‌పై విజయంతో టీమిండియా వరల్డ్ కప్ మ్యాచ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ నెల 27న సిడ్నీ వేదికగా నెదర్లాండ్స్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది. దీని కోసం భారత జట్టు సిడ్నీకి చేరుకుంది. ప్రాక్టీస్ సెషన్‌లో ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఫుడ్‌ సరిగాలేదంటూ టీమిండియా ఆటగాళ్లు ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

25 మంగళవారం భారత్ ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత లంచ్ లోకి పెట్టిన ఫుడ్‌పై టీమిండియా ప్లేయర్స్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు పెట్టిన ఆహారం సరిగా లేదని అది కూడా చాలా చల్లగా ఉందని ఫిర్యాదు చేశారు. ప్రాక్టీస్ చేసి వచ్చిన ఆటగాళ్లకు కేవలం శాండివిచ్‌లు అందులోని చాలా చల్లని సాధారణమైన ఆహారం ఇచ్చారని బీసీసీఐ ఆతిథ్య దేశంపై మండిపడింది. ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ద్వైపాక్షిక సిరీస్‌లో హోస్ట్ అసోసియేషన్ క్యాటరింగ్ బాధ్యతలు నిర్వహిస్తుందని బీసీసీఐకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఏ జట్టుకైనా ప్రాక్టీస్ సెషన్ తరువాత ఎప్పుడు వేడిగా ఉన్న ఆహారం అందిస్తారని చెప్పారు. ఇకపోతే ఐసీసీ టోర్నమెంట్స్‌లోనూ ఈ పద్ధతే కొనసాగుతుందని కేవలం వేడి ఆహారం మాత్రమే అందిస్తారని తెలిపారు. అయితే సిడ్నీలో మాత్రం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసి వచ్చిన తరువాత గ్రిల్ కూడా చేయని చల్లని శాండ్‌విచ్ పెట్టారని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: నా ఆట చూసి నాకే అసహ్యమేసింది.. ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇవి కూడా చదవండి: