Last Updated:

Aaron Finch: నా ఆట చూసి నాకే అసహ్యమేసింది.. ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య టీ 20 వరల్డ్ కప్ 2022 మ్యాచ్ 25 మంగళవారం నాడు ఆస్ట్రేలియాలోని పెర్త నగరం వేదికగా చాలా ఉత్కంఠభరితంగా సాగింది. కాగా లంకతో జరిగిన మ్యాచ్లో, తాను బ్యాటింగ్ చేసిన విధానం తనకే అసహ్యం వేసిందంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Aaron Finch: నా ఆట చూసి నాకే అసహ్యమేసింది.. ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Aaron Finch: ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య టీ 20 వరల్డ్ కప్ 2022 మ్యాచ్ 25 మంగళవారం నాడు ఆస్ట్రేలియాలోని పెర్త నగరం వేదికగా చాలా ఉత్కంఠభరితంగా సాగింది. కాగా లంకతో జరిగిన మ్యాచ్లో, తాను బ్యాటింగ్ చేసిన విధానం తనకే అసహ్యం వేసిందంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చాలా సునాయాస విజయాన్ని కైవసం చేసుకుంది. జట్టులోని ప్లేయర్ అయిన మార్కస్ స్టోయినిస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని ఫించ్ కొనియాడాడు. శ్రీలంక బౌలర్లు అద్భుత బంతులు వేశారని ఫించ్ అన్నాడు. స్టొయినిస్‌ 59 నాటౌట్ గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ అనంతరం ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.. ‘మ్యాచ్ గెలుపొందినందకు చాలా సంతోషంగా ఉంది. కానీ నా ఇన్నింగ్స్ మరీ పేలవంగా ఉంది. నేను బంతిని బాధలేకపోయినందకు నా ఆట చూసి నాకే చాలా అసహ్యంగా అనిపిస్తుంది. అయితే మా జట్టు బ్యాటింగ్ బాగుంది. పిచ్ పేసర్లకు చాలా అనుకూలంగా ఉంది. అందుకే ఇన్నింగ్స్ ఆరంభంలో బ్యాటింగ్‌కు ఇబ్బంది అయ్యిందని కానీ నాకు చివరి వరకు క్రీజులో ఉండటం ముఖ్యం అనిపించిందని చెప్పాడు. నేను హిట్టింగ్ చేస్తే కచ్చితంగా ఔట్ అయ్యేవాడినని తెలిపాడు.

తదుపరి మ్యాచ్‌లో కూడా ఇదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని ఆరోన్ తెలిపాడు. ఇంగ్లండ్‌తో బిగ్ ఫైట్ ఖాయమని.. ఈవెంట్ ఏదైనా, ఫార్మాట్ ఏదైనా ఇంగ్లండ్‌తో మ్యాచ్ ప్రత్యేకమని పేర్కొన్నారు. ఆ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాం’ అని ఆరోన్ ఫించ్ చెప్పాడు. కాగా ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.

ఇదీ చదవండి: కోలీవుడ్ లోకి ఎంఎస్ ధోనీ ఎంట్రీ

ఇవి కూడా చదవండి: