Last Updated:

T20 World cup 2022: టీ20 వరల్డ్ కప్ గ్రూప్-2లో సెమీస్ ఛాన్స్ ఏఏ జట్లకంటే..?

క్రికెట్ లోకమంతా ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ వైపు చూస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలోని గ్రూప్-2లో భాగంగా సెమీస్ కు ఏఏ జట్లు వెళ్తాయి, ఏఏ జట్లు ఇంటి దారి పడతాయనే ఆసక్తి నెలకొంది. మరి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లను ఓ సారి పరిశీలించి ఏఏ జట్లు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటాయో చూద్దాం.

T20 World cup 2022: టీ20 వరల్డ్ కప్ గ్రూప్-2లో సెమీస్ ఛాన్స్ ఏఏ జట్లకంటే..?

T20 World cup 2022: క్రికెట్ లోకమంతా ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ వైపు చూస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలోని గ్రూప్-2లో భాగంగా సెమీస్ కు ఏఏ జట్లు వెళ్తాయి, ఏఏ జట్లు ఇంటి దారి పడతాయనే ఆసక్తి నెలకొంది. మరి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లను ఓ సారి పరిశీలించి ఏఏ జట్లు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటాయో చూద్దాం.

సూపర్-12లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ నెదర్లాండ్స్‌ను ఓడించగా, దక్షిణాఫ్రికా భారత్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే అన్ని జట్ల మూడు రౌండ్ల మ్యాచ్‌లు ముగిసేసరికి గ్రూప్-2 పట్టికలో దక్షిణాఫ్రికా మొదటిస్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానానికి పరిమితమయ్యింది. భారత్‌, జింబాబ్వేలతో ఓటమిపాలైన పాక్ జట్టు ఇప్పటికీ సెమీఫైనల్‌ పోటీ నుంచి తప్పుకోలేదు.

ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల ఆధారంగా దక్షిణాఫ్రికా 3 మ్యాచ్‌లలో 5 పాయింట్లను సాధించగా, భారత్, బంగ్లాదేశ్ చెరో 4 పాయింట్లను తమ ఖాతాలో వేసుకున్నాయి. జింబాబ్వేకు 3 పాయింట్లు రాగా, పాకిస్థాన్‌కు 2 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ జట్టు అయితే ఇంత వరకు ఖాతా తెరవలేదు. ఇకపోతే బుధవారం అనగా 2 నవంబర్ 2022న భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సెమీ-ఫైనల్ రేసులో ఎవరు ముందున్నారనే విషయాన్ని తేల్చడంలో కీలకం కానుంది.

దక్షిణాఫ్రికా అద్భుతమైన నెట్ రన్ రేట్ +2.772ని కలిగి ఉంది. అందువల్ల వారు గ్రూప్ 2 నుండి సెమీ ఫైనల్‌కు దాదాపు ఖరారయినట్టే. ఇకపోతే పాకిస్థాన్ జట్టుకు సెమీస్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. కానీ దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌పై విజయాలను నమోదు చేసి నెట్ రన్‌రేట్ మెరుగుపరుచుకోగలిగితే మాత్రం అప్పుడు సెమీస్ రేసులోకి పాకిస్తాన్ వచ్చే అవకాశం ఉంది.
ఇంక బంగ్లాదేశ్‌పై జింబాబ్వే ఓడిపోవడంతో ఆ జట్టు సెమీస్‌కు వెళ్లే అవకాశం లేదు.

t20 gropu-2 teams

ఇదీ చదవండి: టీమిండియా ఓటమికి కారణాలు చెప్పిన రోహిత్ శర్మ

ఇవి కూడా చదవండి: