IND vs NED: మరోసారి రెచ్చిపోయిన భారత ప్లేయర్స్.. నెదర్లాండ్స్ లక్ష్యం @180
టీమిండియా, నెదర్లాండ్స్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ ముందు 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
IND vs NED: టీమిండియా, నెదర్లాండ్స్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ ముందు 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 120 బంతుల్లో 180 పరుగులు చేస్తేనే నెదర్లాండ్స్ గెలిచే ఛాన్స్ ఉంది.
అయితే ప్రారంభంలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలిగింది. ఓపెనర్లుగా దిగినా కేఎల్ రాహుల్ మరియు రోహిత్ శర్మలలో 9 పరుగులకే ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వాస్తవానికి అది నాటౌట్ కానీ రివ్యూ కోరకపోవడం వల్ల రాహుల్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. కానీ రోహిత్ మాత్రం 39 బంతుల్లో 53 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. పాక్‌పై వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ మరోసారి విజృంభించాడు. 44 బంతుల్లో 62 పరుగులు చేసి ఈ మ్యాచ్లోనూ అజేయంగా నిలిచాడు. ఇకపోతే గత మ్యాచ్ లో నిరాశపరిచిన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి నాటౌట్ గా రాణించాడు. 25 బంతుల్లో 51 పరుగులు తీశాడు. ఇకపోతే నెదర్లాండ్స్ జట్టును కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు.
ఇదీ చదవండి: రిలీ రూసో సూపర్ సెంచరీ.. పొట్టి ప్రపంచ కప్ లో ఇదే మొదటిది