Last Updated:

Asia Cup 2022: పాకిస్థాన్ పై ఘోరంగా ఓడిపోయిన హాంకాంగ్

ఆసియాకప్‌-2022 శుక్రవారం జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 156 పరుగుల తేడాతో హాంకాంగ్ పై భారీ విజయాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్లో హాంగ్ కాంగ్ ఘోరంగా ఓడిపోవడం వల్ల టోర్నీ నుంచి ఇళ్ళకు బ్యాగ్ సర్దేశారు.

Asia Cup 2022: పాకిస్థాన్ పై ఘోరంగా ఓడిపోయిన హాంకాంగ్

Asia Cup 2022: ఆసియాకప్‌-2022 శుక్రవారం జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 156 పరుగుల తేడాతో హాంకాంగ్ పై భారీ విజయాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్లో హాంగ్ కాంగ్ ఘోరంగా ఓడిపోవడం వల్ల టోర్నీ నుంచి ఇళ్ళకు బ్యాగ్ సర్దేశారు. ఈ మ్యాచ్ గెలుపుతో పాకిస్థాన్ సూపర్‌-4లోకి అడుగు పెట్టేసింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ 120 బాల్స్ కు రెండు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

పాకిస్థాన్ ఓపెనర్లుగా దిగిన మహ్మద్‌ రిజ్వాన్‌ 57 బాల్స్ కు 78 పరుగులు, ఫఖర్‌ జమాన్‌ 41 బాల్స్ కు 53 పరుగులు కుష్‌దిల్‌ షా 15 బాల్స్ కు పరుగులు 35 పరుగులు, వీటిలో 5 సిక్సర్లు కొట్టాడు. కుష్ దిల్ షా మ్యాచ్ లో అట్రాక్షన్ గా నిలిచాడు.  194 పరుగులను కొట్టాడానికి దిగిన హాంకాంగ్ 38 పరుగులకే అల్ ఔట్ అయ్యారు.

హాంకాంగ్ వాళ్ళు ఈ రకంగా ఓడిపోయరేంటని క్రికెట్ అభిమానులందరు షాక్ అయ్యారు. పాకిస్థాన్ బౌలర్లు హాంకాంగ్ బ్యాటర్లను చిత్తు చిత్తు చేశారు. ఇక పాకిస్థాన్ బౌలర్లు షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు,నసీం షా రెండు వికెట్లు, దహినీ ఒక వికెట్ తీసుకున్నారు. పాకిస్థాన్ ఈ మ్యాచ్ విన్నింగ్ తో సూపర్ 4 లో ఆదివారం టీమిండియాతో తలపడనుంది.

ఇవి కూడా చదవండి: