Last Updated:

Sardar Movie Review: “సర్దార్” సందడి.. ఊహించని ట్విస్టులతో “స్పై యాక్షన్” చిత్రంగా మంచి టాక్

Sardar Movie Review: “సర్దార్” సందడి.. ఊహించని ట్విస్టులతో “స్పై యాక్షన్” చిత్రంగా మంచి టాక్

Cast & Crew

  • కార్తి (Hero)
  • రాశిఖన్నా, రజిషా విజయన్ (Heroine)
  • చుంకీ పాండే, సిమ్రాన్, మునిష్కాంత్ , మురళీ శర్మ, విజయన్ (Cast)
  • పిఎస్ మిత్రన్ (Director)
  • ఎస్ లక్ష్మణ్ కుమార్ (Producer)
  • జీవి ప్రకాష్ కుమార్ (Music)
  • జార్జ్ సి విలియమ్స్ (Cinematography)
3

Sardar Movie Review: తమిళ తెలుగు ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో కార్తి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులతో శభాష్ అనిపించుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతోన్నాడు ఈ టాలెంటేడ్ హీరో. మరి ఈ యువనటుడు ప్రధాన పాత్రలో తాజాగా తెరకెక్కిన సర్దార్ మూవీ రివ్యూ ఏంటో చూసేద్దామా..

తమిళంలోనే కాదు తెలుగులోనూ కార్తీకి మంచి ప్యాన్ బేస్ ఉంది. ఈ యంగ్ హీరో సినిమాలు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ విజయాలను సాధించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో కార్తి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ థియేటర్లలో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇకపోతే ఇప్పుడు కార్తీ సర్ధార్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తి కథానాయకుడిగా అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ తెరకెక్కించిన సర్దార్ మూవీ నేడు థియేటర్లలో విడుదలయ్యింది. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలుగా నటించారు.

కథ

అవుతూ ట్రెండింగ్ లో ఉండాలనే ఆలోచనతో దూకుడైన పనులు చేస్తుంటాడు. కాగా సీన్ కట్ చేస్తే ఆంధ్రాయూనివర్సిటీ నుంచి ఒక ముఖ్యమైన ఫైల్ కనిపించకుండా పోయినప్పుడు ఈ కథ మొత్తం మలుపు తిరుగుతుంది. అసలు ఆ ఫైల్ ఏంటి? అందులోని సైనిక రహస్యాలు ఎలా మాయమయ్యాయన్న దానిపై సీబీఐ, రా వెతుకుతుంటాయి. అయితే పోలీస్ అధికారి అయిన కార్తి ఈ విషయాన్ని తెలుసుకుని మీడియాలో దేశవ్యాప్తంగా పాపులారిటీ కోసం ఈ ఫైల్ ను వాడుకుంటాడు. సరిగ్గా ఈ క్రమంలో కార్తి తండ్రి కనపడడం.. అతడు మిషన్ లో భాగమవ్వడవ్వడంతో కథ అంతా ఓ టర్న్ తీసుకుంటుంది. అసలు ఆ ఫైల్ ఏంటి కార్తి నాన్నకు ఈ ఫైల్తో సంబంధం ఏంటి అనేది కథ.

కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ సర్దార్ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో విడుదల చేశారు. కాగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే యూఎస్‌తో పాటు తమిళనాట పలు థియేటర్స్‌లో ప్రీమియర్ షోలు పడటంతో కార్తీ అభిమానులు, సినీ లవర్స్ ఈ మూవీపై తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తున్నారు. సర్దార్ ఫస్టాఫ్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉందని, సినిమా ఇంత సూపర్ గా ఉందని అనుకోలేదంటూ పలువురు నెటిజన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. యాక్షన్స్ సీన్స్, ట్విస్ట్ లు ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయని, అలాగే కార్తి నటన ఈ సినిమాకు హైలైట్ అని పలువురు అంటున్నారు.

ఇదీ చదవండి: “ప్రిన్స్” ట్విట్టర్ రివ్యూ.. థియేటర్లలో నవ్వుల వర్షం..!