Last Updated:

Aa Ammayi Gurinchi Meeku Cheppali: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ట్విట్టర్ రివ్యూ

Aa Ammayi Gurinchi Meeku Cheppali: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ట్విట్టర్ రివ్యూ

Cast & Crew

  • సుధీర్ బాబు (Hero)
  • కృతి శెట్టి (Heroine)
  • శ్రీనివాస్,వెన్నెల కిషోర్,రాహుల్ రామకృష్ణ,కునాల్ కౌశిక్ (Cast)
  • మోహనకృష్ణ ఇంద్రగంటి (Director)
  • మైత్రీ మూవీ మేకర్స్ (Producer)
  • వివేక్ సాగర్ (Music)
  • పీ. జీ విందా (Cinematography)
2.7

Tollywood: సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా ” ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ” సినిమా నేడు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఉప్పెన సినిమాతో ఫేమస్ ఐనా కృతి శెట్టి కథానాయికగా నటించారు. ఈ సినిమా ఎమోషనల్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా మన ముందుకు వచ్చింది. ఈ సినిమా భారీ అంచనాలు నడుమ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమాకు సంభందించిన ట్రైలర్ అండ్ టీజర్స్‌ ఒక ట్రెండును సృష్టించాయి. ఈ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి  దర్శకత్వం వహిస్తున్నారు. బెంచ్ మార్క్ స్టూడియోస్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ స్వరాలను అందించారు. ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్న అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, కునాల్ కౌశిక్ తదితర నటినటులు నటించారు.

ఇప్పటికే ఈ సినిమా మీద పలు రివ్యూస్ వచ్చాయి. దీంతో ఈ సినిమాను చూసిన సినీ ప్రేక్షకులు, అభిమానులు సినిమా ఎలా ఉంది, సినిమా కథేంటీ ? తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోనుందా లేదా అన్నది చూడాలి. హీరో హీరోయిన్స్ నటన పై పలు రకాల కామెంట్స్ చేసి వారి అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఒక అందమైన ప్రేమకథను చిత్రీకరించారని తెలుస్తోంది. ఒక్కసారి ఇంద్రగంటి కళ్ళలో పడితే ఏ హీరో ఐనా ఇట్టే కనెక్ట్ ఐపోతాడు. అలాగే వారికి ఆయనతో వరస సినిమాలు చేసే అవకాశాలు కూడా ఇస్తుంటారు. సుధీర్ బాబు కూడా అలానే క కనెక్ట్ ఐనట్టు తెలుస్తుంది. నాలుగు ఏళ్ళ కిందట వీరిద్దరి కాంబినేషన్‌లో సమ్మోహనం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఆ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. అలాగే ఆ తర్వాత నాని విలన్ గా వచ్చిన సినిమా ‘వి’ లో కూడా సుధీర్ బాబు హీరోగా నటించారు. ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా.

ఈ సినిమాకు సంబంధించిన కామెంట్స్ చూస్తుంటే, సినిమాకు మంచి మార్కులే పడ్డాయని అనిపిస్తుంది. సినీ ప్రేక్షకులకు రివ్యూస్ పాజిటివ్ గానే ఇస్తున్నారు. కొంతమంది ఫస్టాఫ్  బాగుందని మరికొంత మంది సెకండాఫ్ బాగుందని అంటున్నారు.

ఈ సినిమా కథ ఏంటంటే

ఐదు సూపర్ హిట్ సినిమాలను వెంట వెంటనే ఇచ్చిన డైరెక్టర్ నవీన్(సుధీర్ బాబు) ఈసారి ఎలా ఐనా బ్లాక్ బాస్టర్ సినిమా తియ్యలని భిన్నమైన సినిమా చేయాలని భావిస్తూ ఉంటాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలు చేయడమే కాదు తనకంటూ పేరు తెచ్చుకునే విధంగా భిన్నమైన సబ్జెక్ట్ చేయాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్న సమయంలో రోడ్డు మీద వెళుతున్న క్రమంలో ఒక పాడైన సినిమా రీల్ దొరుకుతుంది. డిజిటల్ యుగంలో కూడా రీల్స్ వాడుతున్నారా అని అనుమానం వచ్చి ఆ రీల్ తనకు తెలిసిన ల్యాబ్లో కడిగిస్తాడు. ఆ సమయంలో ఆ రీల్ లో నటించిన అమ్మాయిని చూసి మెస్మరైజ్ అవుతాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ అలేఖ్య అని తెలుసుకుంటాడు. సినిమా నటి అవ్వాలని కోరికతో సినీ డైరెక్టర్ ను పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్న సమయంలో ఆ డైరెక్టర్ చేసే సినిమా ఆగిపోవడంతో సినిమాలో పని చేసే ఇద్దరూ భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడంతో అలేఖ్య కుటుంబం అప్పటి నుంచి సినిమా మీద అసహ్యం పెంచుకుంటారు. అలేఖ్య, సుధీర్ బాబు సినిమాలో నటించిందా ? లేదా అన్నది కథ !

సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే

ఫ్రెండ్స్ , ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడవచ్చు సినిమా .

ఇవి కూడా చదవండి: