Bharat Jodo Yatra: మీ ట్రక్కులకు బీజేపీ రాష్ట్రాల్లో డీజిల్ నింపుకోండి.. కాంగ్రెస్ కు కేంద్రమంత్రి సలహా
భారత్ జోడో యాత్రలో భాగం కాంగ్రెస్ పార్టీ తమ ట్రక్కులకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) పాలిత రాష్ట్రాల్లో ఇంధనం నింపుకుంటే డబ్బులు ఆదా అవుతాయని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సలహా ఇచ్చారు.
New Delhi: భారత్ జోడో యాత్రలో భాగం కాంగ్రెస్ పార్టీ తమ ట్రక్కులకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) పాలిత రాష్ట్రాల్లో ఇంధనం నింపుకుంటే డబ్బులు ఆదా అవుతాయని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సలహా ఇచ్చారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేసారు.
12 రాష్ట్రాలలో తమ భారత్ జోడో యాత్రలో డీజిల్ వాహనం పై కాంగ్రెస్ సుమారు రూ. 1,050 నుండి రూ. 2,205 ఆదా చేసుకోగలదని పూరీ చెప్పారు. “కాంగ్రెస్‌కు ఒక సలహా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంధనం నింపడం ద్వారా మీరు డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు, తెలంగాణ మరియు జమ్మూకశ్మీర్ మధ్య లీటర్ కు రూ.14.5 ఉందంటూ పూరి ట్వీట్ చేశారు.
పూరీ డీజిల్ ధరలను బీజేపీయేతర పాలిత రాష్ట్రాలతో పోల్చి ట్వీట్ చేసారు. మొత్తానికి, 12 రాష్ట్రాలు, 3,500 కిమీ. 150 రోజుల పాటు వారి ప్రయాణంలో, కాంగ్రెస్ డీజిల్ వాహనం పై రూ1050 నుంచి రూ.2205 మధ్య ఆదా చేయగలదు. వారి ‘యువ’ నాయకుడు సాధారణంగా ప్రయాణించే భారీ పరివారం మరియు విలాసవంతమైన వాహనాల కాన్వాయ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ సలహా. వారు నాకు తర్వాత కృతజ్ఞతలు తెలుపగలరు అని పూరీ ట్వీట్ చేసారు.
A word of advice for Congress:
It can take a leaf out of the common citizen’s book by refuelling in BJP served states before entering states which have turned a blind eye to fuel price reduction.
For example, there’s a difference of as much as ₹14.5/ltr between Telangana & J&K. pic.twitter.com/DkG57Phcja— Hardeep Singh Puri (@HardeepSPuri) September 9, 2022