CM Yogi Temple: సీఎం యోగి ఆదిత్యనాధ్ కు గుడి కట్టి పూజలు
అయోధ్య సమీపంలో ఒక వ్యక్తి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు గుడి కట్టి పూజలు చేస్తున్నాడు. అయోధ్య-గోరఖ్‌పూర్ హైవే పై భరత్‌కుండ్ సమీపంలోని యోగి ఆదిత్యనాధ్ ఆలయం ఉంది. మౌర్య అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు.
Ayodhya: అయోధ్య సమీపంలో ఒక వ్యక్తి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు గుడి కట్టి పూజలు చేస్తున్నాడు. అయోధ్య-గోరఖ్‌పూర్ హైవే పై భరత్‌కుండ్ సమీపంలోని యోగి ఆదిత్యనాధ్ ఆలయం ఉంది. మౌర్య అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు. అయోధ్యలో శ్రీరాముడికి ఆలయాన్ని నిర్మించే వ్యక్తి పేరు మీద ఆలయాన్ని నిర్మిస్తానని తాను గతంలో నిర్ణయించుకున్నట్లు మౌర్య తెలిపారు. ఇపుడు యోగి ఆ పనిచేస్తున్నందున ఆయనకు గుడికట్టి పూజలు చేస్తున్నామన్నారు. ఈ ఆలయంలో యోగి విగ్రహం రాముని అవతారంలో ఉంది.
హారతి సమయంలో ముఖ్యమంత్రిని కీర్తిస్తూ భజనలు పాడతారు. ఈ ప్రదేశాన్ని ప్రచారం చేయడానికి భజనల ఆడియో మరియు వీడియో క్యాసెట్లను సిద్ధం చేస్తున్నారు. యోగి ఆదిత్యనాధ్ ఎత్తు 5.4 అడుగులు కాబట్టి ప్రతిష్టించిన విగ్రహం కూడ అదే సైజులో ఉంది. విగ్రహం పై ఉన్న దుస్తులు కూడ యోగి ఆదిత్యనాథ్ ధరించే దుస్తుల మాదిరే ఉండటం విశేషం. యూపీలోని బారాబంకి జిల్లాకు చెందిన మౌర్య స్నేహితుడు ఈ విగ్రహాన్ని చెక్కారు. దీనికోసం ఆయనకు రెండు నెలల సమయం పట్టింది.