Last Updated:

Delhi: ఢిల్లీ జైల్లో కన్నీళ్లు పెట్టుకున్న సుకేష్ చంద్రశేఖర్.. ఎందుకో తెలుసా?

కోట్లాది రూపాయల లాండరింగ్ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ అధికారుల ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఢిల్లీలోని అతని జైలు గది నుండి లక్షల విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Delhi: ఢిల్లీ జైల్లో కన్నీళ్లు పెట్టుకున్న సుకేష్ చంద్రశేఖర్.. ఎందుకో తెలుసా?

Delhi: కోట్లాది రూపాయల లాండరింగ్ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ అధికారుల ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఢిల్లీలోని అతని జైలు గది నుండి లక్షల విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనితో సుకేష్ ఏడ్వడం ప్రారంభించాడు. సిసిటివి విజువల్స్ చూపించింది.

లక్షలవిలువైన చెప్పులు, జీన్స్ స్వాధీనం..(Delhi)

సుకేష్ గదిలో 1.5 లక్షల విలువైన చెప్పులు మరియు రూ.80,000 విలువైన రెండు జతల జీన్స్‌ స్వాధీనం చేసుకున్నారు.సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బందితో కలిసి లర్ దీపక్ శర్మ ఆకస్మిక తనిఖీలు చేసారు.ఖైదీల సెల్స్ లో ఆయుధాలు, మొబైల్ ఫోన్‌లు లేదా మాదక ద్రవ్యాలు వంటి ఏ విధమైన నిషిద్ధ వస్తువులు లేవని నిర్ధారించడానికి జైలు అధికారులు సాధారణంగా ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు.

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు నోరా ఫతేహీలను కూడా పోలీసులు ప్రశ్నించారు.రిలిగేర్ మాజీ ప్రమోటర్ మల్విందర్ సింగ్ భార్యను మోసం చేసిన మనీలాండరింగ్ కేసులో సుకేష్‌ చంద్రశేఖర్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజా అభియోగాలు మోపింది.సింగ్ భార్య తన భర్తకు బెయిల్ ఇవ్వడానికి రూ.3.5 కోట్లకు పైగా చెల్లించిందని ఈడీ ఆరోపించింది.

తీహార్ జైలు నుంచి మండోలి జైలుకు తరలింపు..

అత్యంత భద్రతతో కూడిన తీహార్ జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ మరియు అతని భార్య లీనా పాల్ తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ, తనను ఢిల్లీ వెలుపల జైలుకు తరలించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో, 2022 ఆగస్టులో మండోలి జైలుకు తరలించారు.మనీలాండరింగ్, పలువురిని బలవంతంగా వసూళ్లు చేసిన ఆరోపణలపై సుకేష్‌కు జైలు శిక్ష పడింది. తీహార్ జైలులో ఉన్నప్పుడు, జైలు ఉన్నతాధికారులు దోపిడీ రాకెట్‌ను నడుపుతున్నారని, తన నుండి కోట్లాది లంచాలు తీసుకున్నారని ఆరోపించారు.

ప్రతిగా, జైలు వెలుపల అతని సహచరులను సంప్రదించడానికి అధికారులు మొబైల్ ఫోన్లు మరియు ఇతర సౌకర్యాలను అందించారు, గత ఏడాది జూలైలో అవినీతి ఆరోపణలపై 81 మంది తీహార్ జైలు అధికారులను బుక్ చేసిన తర్వాత ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) తెలిపింది.

టీవీనటి చాహత్ ఖన్నాకు రూ. 100 కోట్లు లీగల్ నోటీసు పంపిన సుకేష్ చంద్రశేఖర్..

సుకేష్ చంద్రశేఖర్ టీవీనటి చాహత్ ఖన్నాకు రూ. 100 కోట్లు మేరకు లీగల్ నోటీసు పంపాడు. చాహత్, ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తీహార్ జైలులో చంద్రశేఖర్ ను కలవడంతో తాను ఈ కేసులో చిక్కుకున్నానని తెలిపింది. జైలులో అతను తన ముందు మోకాళ్లపైన కూర్చుని పెళ్లి ప్రతిపాదన చేశాడని పేర్కొంది.తనకు ఇదివరకే పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పగా.. తన భర్త తనకు సరైన వ్యక్తి కాదని చెప్పాడని తెలిపింది.చంద్రశేఖర్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత మేనల్లుడు కాదని తనకు ఏడాదిక్రితంతెలిసిందని చాహత్ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి జనవరి 3న ఆమె పాటియాలా హౌస్ కోర్టు ముందు వాంగ్మూలం కూడా ఇచ్చింది.

చంద్రశేఖర్ తరపు న్యాయవాది అనంత్ మాలిక్ ఆమెకు పంపిన లీగల్ నోటీసులో ఇలా పేర్కొన్నారు.ప్రస్తుత నోటీసు మీరు దర్యాప్తు సంస్థలకు ఇచ్చిన వాంగ్మూలాలకు సంబంధించింది కాదని, కేవలం ఈ నోటీసుకు సంబంధించి మాత్రమే జారీ చేస్తున్నట్లు మొదట్లో స్పష్టం చేస్తున్నాం.మీ ఇంటర్వ్యూలో, మీరు (ఖన్నా) మా క్లయింట్‌ని కలవడానికి మీరు తీహార్ జైలులోకి బలవంతంగా ప్రవేశించారని తప్పుగా క్లెయిమ్ చేసారు. అందులో అతను మీకు మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేసాడని అన్నారు. ఇది మీ స్వంత ప్రకటన. మీరు మే 2018లో శ్రీమతి ఏంజెల్‌తో కలిసి మీ ప్రాజెక్ట్‌లు, చలనచిత్రాలు, షోలు మొదలైనవాటికి ఆర్థిక సహాయం చేయబోతున్న మా క్లయింట్‌ని కలవడానికి ఆమెతో కలిసి ఢిల్లీకి వెళ్లినట్లు రికార్డులో ఉంది.