Last Updated:

Tushar Arun Gandhi: కరెన్సీ నోట్లపై మా ముత్తాత బొమ్మ తీసేయండి.. మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ అరుణ్ గాంధీ

ఆర్బీఐ ప్రవేశ పెట్టిన డిజిటల్ రూపీపై గాంధీ బొమ్మ లేకపోవడంపై ఆయన మునిమనవడు తుషార్ అరుణ్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు.

Tushar Arun Gandhi: కరెన్సీ నోట్లపై మా ముత్తాత బొమ్మ తీసేయండి.. మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ అరుణ్ గాంధీ

Tushar Arun Gandhi: ఆర్బీఐ ప్రవేశ పెట్టిన డిజిటల్ రూపీపై గాంధీ బొమ్మ లేకపోవడంపై ఆయన మునిమనవడు తుషార్ అరుణ్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు. కొత్తగా తెచ్చిన డిజిటల్ కరెన్సీపై గాంధీ బొమ్మ వేయనందుకు ప్రభుత్వానికి, ఆర్బీఐకి ధన్యవాదాలు. ఇప్పుడు ఆయన బొమ్మను పేపర్ కరెన్సీపై కూడా తీసేయండి అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు మరియు భువనేశ్వర్ లో డిజిటల్ రూపాయి మొదటి పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఇది డిజిటల్ టోకెన్ రూపంలో ఉంది. కస్టమర్లు డిజిటల్ వాలెట్ ద్వారా డిజిటల్ రూపాయి కోసం బ్యాంకులను అభ్యర్థించిన మొత్తం వారి డిజిటల్ రూపాయి వాలెట్‌లకు క్రెడిట్ చేయబడుతుంది. దీనివల్ల కరెన్సీ వ్యయాలు ఆదా అవడంతో పాటు నగదు నిర్వహణ రూపంలో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం చలామణిలీ ఉన్న అన్ని రకాల డినామినేషన్లలో ఈ – రూపీ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి: