Rahul Gandhi: ప్రజల బాధలు వింటే కన్నీళ్లు వచ్చాయి.. ముగింపు సభలో రాహుల్ గాంధీ భావోద్వేగం
Rahul Gandhi: దేశంలోని ప్రజా సమస్యలను వినడం.. ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. ముగింపు సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఎమోషనల్ అయ్యారు.
Rahul Gandhi: దేశంలోని ప్రజా సమస్యలను వినడం.. ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. ముగింపు సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఎమోషనల్ అయ్యారు. ఈ యాత్రలో జరిగిన అనుభవాలను ఆయన పంచుకున్నారు. గడ్డకట్టే మంచులోనూ రాహుల్ గాంధీ ప్రసంగించిన తీరుతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సభకు విపక్ష పార్టీల నేతలు.. కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్నారు.
ముగిసిన భారత్ జోడో యాత్ర..
జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. మంచు పడుతున్న కూడా.. రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. భారత్ జోడో యాత్ర అనుకున్నదానికంటే ఎక్కువ విజయవంతమైందని అన్నారు. ఈ యాత్ర ఎన్నో పాఠాలు నేర్పిందని.. ప్రజల కష్టాలు దగ్గరుండి చుశానని రాహుల్ తెలిపారు.
కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర.. కశ్మీర్ లో ముగిసింది. వేల కిలోమీటర్లు.. ప్రజల మద్దతుతోనే నడిచానని రాహుల్ గాంధీ అన్నారు. కశ్మీర్ ప్రజలకు దేశం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజల బాధలు చూసి.. కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రజల సహకారం ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. ఓ దశలో యాత్ర పూర్తి చేయగలనా? లేదా అనే అనుమానం వచ్చినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామని మాటిచ్చారు.
ఈ పాదయాత్రలో ఎంతో మంది నిరుపేదలను చూసే.. తాను టీ షర్ట్ తో యాత్ర చేసినట్లు పేర్కొన్నారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శలు..
ముగింపు సభలో మాట్లాడిన రాహుల్.. మోదీ అమిత్ షా పై విమర్శలు చేశారు. భాజపా ప్రభుత్వం కావాలనే.. హింసను ప్రేరేపిస్తుందని ఆరోపించారు. అన్ని వర్గాలను ఏకం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ యాత్ర విజయవంతం అయిందని అన్నారు.
విద్వేషాలు రెచ్చగొట్టే ప్రభుత్వాలను కూల్చివేయాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
మంచు వర్షంలో రాహుల్..
ఈ యాత్ర ముగింపు సభకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. కానీ ఉదయం నుంచి మంచు వర్షం కురిసింది. దీంతో రాహుల్ మంచులోనే ప్రసంగం కొనసాగించారు.
ఈ పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు.
సెప్టెంబరు 7 2022న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ కన్యాకుమారిలో ఈ యాత్రను ప్రారంభించారు.
విభజన రాజకీయాలతో అల్లాడుతున్న దేశ ప్రజలను ఏకం చేయడానికి.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు.
సెప్టెంబరు 7న ప్రారంభమైన ఈ యాత్ర.. శ్రీనగర్‌లో ముగిసింది.
దేశంలో క్రమంగా కాంగ్రెస్ అస్థిత్వం కోల్పోతున్న సమయంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపారు.
సుమారు 5 నెలలపాటు సాగిన ఈ యాత్ర.. 4వేల కిలోమీటర్లు కొనసాగింది.
భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా కచ్చింతగా ప్రభావం చూపుతుందని రాహుల్ గాంధీ అన్నారు.
బీజేపీ-ఆర్‌ఎస్ఎస్ విద్వేష వైఖరికి ఈ పాదయాత్ర ప్రత్యామ్నాయ మార్గమని అన్నారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ పాదయాత్ర సాగింది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన యాత్ర.. భారత్ లోని 12 రాష్ట్రాలను చుట్టేసింది.
150 రోజులపాటు కొనసాగిన యాత్ర.. చివరకు కశ్మీర్ లోని శ్రీనగర్ లో ముగిసింది.
ఈ పాదయాత్రలో రాహుల్ కోట్లాది మందిని కలుసుకున్నారు. దేశంలో ఇంతవరకు ఏ పాదయాత్రకు రాని విధంగా భారత్ జోడో యాత్రకు భారీ స్పందన వచ్చింది.
ప్రజలతో మమేకమై పాదయాత్ర చేసిన రాహుల్.. వారి సమస్యలను తెలుసుకున్నారు.
మరోవైపు ప్రజలు కూడా రాహుల్ పంథాను అర్థం చేసుకుని అడుగులు కలిపారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా పాదయాత్రలో పాల్గొన్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/