Home / జాతీయం
ఇటీవల బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హెల్త్ చకప్ కోసం కోలకతా వచ్చి అటు నుంచి అదృశ్యమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన హత్యకు గురైనట్లు కోలకతా పోలీసులు వెల్లడించడం కూడా జరిగింది. అయితే ఈ హత్య మిస్టరీని కోలకతా పోలీసులు భేదించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే ఈ హత్య గురించి పోలీసులు నిర్ఘాంతపోయే విషయాలను వెల్లడించారు.
అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారి గుట్టు రట్టైంది. కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డ సబిత్ నాసిర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు దళారులు ఈ రాకెట్‌ను నడిపించారని.. అందులో ఒక వైద్యుడు ఉన్నాడని తేలింది.
చత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలకు.. నక్సలైట్లకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు మృతి చెందారు. నారాయణపూర్ -బీజూపూర్ జిల్లాల సరిహద్దులో గల అటవీ ప్రాంతంలో గురువారం నాడు భద్రతా దళాలకు .. నక్సలైట్లకు మధ్య ఎదుర కాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందారని పోలీసులు తెలిపారు.
ప్రజ్వల్ రేవన్న డిప్లామాటిక్ పాస్‌పోర్టు రద్దు చేయించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీని మరో మారు కోరారు. ప్రస్తుతం ప్రజ్వల్ రేవన్నపై పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే
న్యూఢిల్లీలోని మినిస్ర్టీ ఆఫ్ హోం ఎఫైర్స్ ఆఫీస్‌కు బుధవారం బాంబు బెదిరింపు ఈ మెయిల్‌వచ్చింది. దాంతో బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఫైర్ టెండర్స్‌ను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయని.. ఎలాంటి అనుమానిత వస్తువు కనిపించలేదని పోలీసులు అధికారులు తెలిపారు.
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లోకసభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ పెట్టుకున్నారు. అయితే ఆయన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థాన తిరస్కరించింది.
లోక్ సభ పోలింగ్ ఐదవ విడత సోమవారంతో ముగిసింది. ఎన్నికల వ్యూహకర్త.. జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఓ జాతీయ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో మారు కేంద్రంలో భారతీయ జనతాపార్టీలో అధికారం చేపట్టబోతోందని స్పష్టం చేశారు.
డ్రంకన్ డ్రైవ్ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. పూనేలో టీనేజర్ నిర్లక్ష్యంగా కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థి పరీక్ష పాస్ అయిన తర్వాత మిత్రులతో కలిసి సరదాగా పబ్‌లో మందుపార్టీ చేసుకున్నాడు.
చత్తీస్‌గఢ్‌లో పికప్ వ్యాన్ బోల్తా పడ్డంతో సుమారు 18 మంది మృతి చెందారు. వారిలో 17 మంది మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు.. నలుగురికి గాయాలు అయ్యాయని చత్తీస్‌గఢ్‌లోని కబీర్‌థామ్ జిల్లాలో పికప్ వ్యాన్ లోయలోపడ్డంతో జరిగిన ఘటనతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అధికారులు సోమవారం నాడు చెప్పారు
: ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నాడు ఒడిషాలో సుడిగాలి పర్యటన చేశారు. కటక్‌లో జరగిన ఓ ఎన్నికల ర్యాలీలో బిజు జనతాదళ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ర్టం మొత్తం మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు.