Last Updated:

Pune Teen: పూనేలో మద్యం తాగి ఇద్దరు వ్యక్తులను కారుతో ఢీకొట్టిన విద్యార్థి

డ్రంకన్‌ డ్రైవ్‌ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. పూనేలో టీనేజర్‌ నిర్లక్ష్యంగా కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థి పరీక్ష పాస్‌ అయిన తర్వాత మిత్రులతో కలిసి సరదాగా పబ్‌లో మందుపార్టీ చేసుకున్నాడు.

Pune Teen: పూనేలో మద్యం తాగి ఇద్దరు వ్యక్తులను కారుతో ఢీకొట్టిన విద్యార్థి

Pune Teen: డ్రంకన్‌ డ్రైవ్‌ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. పూనేలో టీనేజర్‌ నిర్లక్ష్యంగా కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థి పరీక్ష పాస్‌ అయిన తర్వాత మిత్రులతో కలిసి సరదాగా పబ్‌లో మందుపార్టీ చేసుకున్నాడు. మద్యం తాగిన తర్వాత తన ఖరీదైన పార్శే కారును డ్రైవ్‌ చేస్తూ మోటార్‌బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టాడు. సంఘటనకు ముందు తన మిత్రులతో కలిసి పబ్‌లో మద్యం తాగిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే టీనేజర్‌ వయసు 17 సంవత్సరాలు మాత్రమే… 18 సంవత్సరాలకు ఇంకా నాలుగు నెలలు తక్కువగా ఉండటం గమనార్హం. లైసెన్స్‌ లేకుండా కారు నడుపడం నేరం కూడా.

15 గంటల్లోనే బెయిల్ ..(Pune Teen)

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి… ఓ మహళ.. ఇద్దరు ఇంజినీర్లు . వీరు పూనేలో పనిచేస్తున్నారు. ఈ టీనేజర్‌ నిర్వాకం వల్ల వీరిద్దరు మృత్యువాతపడ్డారు. కాగా మద్యం మత్తులో ఉన్న టీనేజర్‌ తన పార్శే కారును వేగంగా నడుపుకుంటూ వచ్చి బైక్‌పై వెళుతున్న అనీష్‌ అవాదియా, అశ్విని కోస్తాను ఢీకొట్టాడు. ఈ సంఘటన శనివారం నమధ్యాహ్నం 2.15 గంటలకు జరిగింది. పోలీసులు అరెస్టు చేసిన తర్వాత 15 గంటల్లోనే బెయిల్‌ కూడా తెచ్చుకున్నాడు. పూనే డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ విజయకుమార్ మగార్‌ కూడా మైనర్‌ను అరెస్టు చేసినట్లు అంగీకరించారు.

ఇదిలా ఉండగా పోలీసులు మైనర్‌ను ర్యాష్‌ డ్రైవింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైనందుకు ఇండియాన్‌ పీనల్‌ కోడ్‌లోని పలు సెక్షన్ల కింద… మహారాష్ర్ట మోటార్‌ వెహికిల్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఇక మైనర్‌ బెయిల్‌ కండిషన్‌ విషయానికి వస్తే ప్రమాదాల గురించి వ్యాసాలు రాయడం, యోరవాడ ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి 15 రోజుల పాటు పనిచేయడం.. అల్కాహాల్‌ అలవాట్ల నుంచి తప్పించడానికి అతని చికిత్స అందించడం… సైక్రియాట్రిక్‌తో కౌన్సిలింగ్‌ ఇప్పించడం వంటివి మైనర్‌కి ఇప్పిస్తామని పోలీసులు చెప్పారు. అయితే పూనే పోలీసు కమిషనర్‌ అమితేష్‌కుమార్‌ మాత్రం కోర్టును మైనర్‌ను మేజర్‌గానే పరిగణాంచాలని కోరుతున్నారు. ఎందుకంటే అతడు చేసిన ఘోరమైన నేరానికి ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని చెప్పాడు. మైనర్‌ మద్యం తాగి ఇద్దరు ప్రాణాలు తీశాడు. దీనికి సాక్ష్యాలు ఉన్నాయి. టీనేజర్‌ మిత్రులు కూడా విపరీతంగా మద్యం సేవించారని సీపీ చెప్పారు. బాలుడి తండ్రితో పాటు మద్యం సర్వ్‌ చేసిన పబ్‌ యజమానికి వ్యతిరేకంగా కేసు ఫైల్‌ చేయాలని పూనే ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.