Last Updated:

Bangladesh MP Murder: బంగ్లాదేశ్‌ ఎంపీ హత్య వెనుక హనీట్రాప్

ఇటీవల బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనార్‌ హెల్త్‌ చకప్‌ కోసం కోలకతా వచ్చి అటు నుంచి అదృశ్యమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన హత్యకు గురైనట్లు కోలకతా పోలీసులు వెల్లడించడం కూడా జరిగింది. అయితే ఈ హత్య మిస్టరీని కోలకతా పోలీసులు భేదించారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించే ఈ హత్య గురించి పోలీసులు నిర్ఘాంతపోయే విషయాలను వెల్లడించారు.

Bangladesh MP Murder:  బంగ్లాదేశ్‌ ఎంపీ హత్య వెనుక హనీట్రాప్

Bangladesh MP Murder: ఇటీవల బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనార్‌ హెల్త్‌ చకప్‌ కోసం కోలకతా వచ్చి అటు నుంచి అదృశ్యమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన హత్యకు గురైనట్లు కోలకతా పోలీసులు వెల్లడించడం కూడా జరిగింది. అయితే ఈ హత్య మిస్టరీని కోలకతా పోలీసులు భేదించారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించే ఈ హత్య గురించి పోలీసులు నిర్ఘాంతపోయే విషయాలను వెల్లడించారు.

కోలకతా పోలీసువర్గాల సమాచారం ప్రకారం అఖ్తరుజ్జమాన్‌ అనే వ్యక్తి శిలాంతి అనే మహిళను ఎంపీని లోబర్చుకోవడానికి ఉపయోగించాడు. ఈ మహిళ ద్వారా ఎంపీని బంగ్లాదేశ్‌ నుంచి కోలకతా రప్పించారు. ప్రస్తుతం శిలాంతి అనే మహిళ బంగ్లాదేశ్‌ పోలీసుల అదుపులో ఉంది ఆమె స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డు చేసుకున్నారు.

హత్య చేయడానికి రూ.5 కోట్లు..(Bangladesh MP Murder)

అయితే బంగ్లాదేశ్‌ ఎంపీ హత్య కేసు గురించి రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఎంపీ హత్య వెనుకు ఆయన చిన్ననాటి మిత్రుడు హస్తం ఉందని చెబుతున్నారు. ఈ హత్యకు రూ.5 కోట్ల బేరం కుదిరింది.. దీంతో పాటు ఎంపీని ఆకర్షించడానికి ఓ అందమైన యువతని రంగంలోకి దింపి కోలకతా రప్పించారు. ఇక ఆ యువతి విషయానికి వస్తే శిలాంతి రెహమాన్‌ బంగ్లాదేశ్‌ పౌరురాలు. కాగా శిలాంతి విషయానికి వస్తే ఆమె అఖ్తరుజ్జమాన్‌ షహీన్‌ గర్ల్‌ఫ్రెండ్‌. ఎంపీ హత్యకు సూత్రధారుడు కూడా అఖ్తరుజ్జమానే. ఎంపీ హత్య జరిగినప్పుడు ఆమె కోలకతాలో ఉన్నారు. ఆమె వెంట అమానుల్లా అమన్‌ అనే వ్యక్తి కూడా వచ్చాడు. ఈ హత్య కేసులో ఆయన అనుమానితుడు ఈ హత్య తర్వాత వీరంతా మే15 ఢాకా వెళ్లిపోయారు. పశ్చిమ బెంగాల్‌ సీఐడి ఈ హత్యకు సంబంధించి జిహాద్‌ హవల్దార్‌ను అరెస్టు చేశారు. కాగా హవల్దార్‌ విషయానికి వస్తే ముంబైలో కసాయి వృత్తిలో ఉన్నాడు. ప్రత్యేకంగా అతన్ని అఖ్తరుజ్జామాన్‌ ఈ హత్య చేయడానికి ముంబై నుంచి కోలకతా పిలపించాడు. ఇక హవల్దార్‌ విషయానికి వస్తే బంగ్లాదేశ్‌ నుంచి చట్టవ్యతిరేకంగా ఇండియాలో ప్రవేశించాడు. పోలీసుల విచారణలో ఈ హత్య గురించి పూర్తి వివరాలు వెల్లడించాడు హవల్దార్‌.

చర్మాన్ని వలిచి.. ఎముకలను ముక్కలుగా కోసి..

బంగ్లాదేశ్‌ చెందిన వ్యక్తి ప్రస్తుతం అమెరికా పౌరుడు అఖ్తరుజ్జుమాన్‌ తనను ఈ హత్య కోసం ఎంపిక చేశాడు. శిలాంతి రెహమాన్‌ వెంట ఎంపీ గదిలోకి రాగానే గొంతుపిసికి చంపేసి అతని చర్మాన్ని వలిచి, ఎముకలను ముక్కలు ముక్కలుగా నరికి ఆయన ముఖం ఆనవాళ్లు లేకుండా చెక్కి ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో వేసుకొని నగరంలోని పలు ప్రాంతాల్లో వెదజల్లామని చెప్పాడు. సీసీటీవీలో కూడా అనార్‌ వెంట ఓ మహిళ ఉన్నట్లు కనిపించిందని పోలీసులు చెప్పారు.

మూడుసార్లు బంగ్లాదేశ్‌ ఎంపీగా గెలిచిన అన్వరుల్‌ అనార్‌ ఈ నెల 12న హెల్త్‌ చెకప్‌ కోసం కోలకతా వచ్చారు. రాగనే తన చిరకాల మిత్రుడు గోపాల్‌ బిశ్వాస్‌లో ఉన్నాడు. తర్వాత తన కోలకతాలో అద్దె ప్లాట్‌కు వెళ్లిపోయాడు. ఈ నెల 14 నుంచి అతని ఆచూకీ తెలియకుండా పోయింది. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. ఆయన ఫోన్‌ కూడా స్విచాఫ్‌లో ఉంది. మొత్తానికి ఎంపీ హనీట్రాప్‌లో పడి తన ప్రాణాలు పొగొట్టుకోవడం విచారకరం.

ఇవి కూడా చదవండి: