Home / జాతీయం
ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోకసభ స్థానం సస్పెన్స్ ముగిసింది. ఆ స్థానం నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఒకప్పటి సోనియాగాంధీ క్యాంపెయిన్ మేనేజర్ రాహుల్‌గాంధీతో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన యోగి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద జార్ఖడ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం దాడులు నిర్వహిస్తోంది. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ గృహ సహాయకుడి ఆవరణలో సోదాల్లో సుమారు రూ. 20 కోట్ల నగదు లభించింది.
లోక్ సభ మూడవ విడత పోలింగ్‌కు గడువు దగ్గరపడుతోంది. ఓటర్లు రాజకీయ నాయకులను తమ సమస్యలను తీరిస్తేనే ఓట్లు వేస్తామని బెట్టు చేస్తున్నారు. ఇక తాజా ఉదంతం విషయానికి వస్తే మహారాష్ర్టలోని సాంగ్లీ జిల్లాను తీసుకుంటే ఇక్కడ పలు తాలూకాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.
కర్ణాటక హసన్ ఎంపీ ప్రజ్వల్ రెవన్న, ఆయన తండ్రి ఎమ్మెల్యే హెచ్డీ రెవన్నలు మహిళలపై అత్యాచారాల కేసులు, సెక్స్ టేప్‌ల కేసులు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపిన విషయం తెలిసింది. కాగా ప్రజ్వల్‌పై ఇప్పటి వరకు కర్ణాటకలోని పలు పోలీసు స్టేషన్లలో తమపై తుపాకి చూపించి అత్యాచారానికి పాల్పడ్డాడని పలువురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి మాజీ డిల్లీ కాంగ్రెస్ చీఫ్ అర్విందర్ సింగ్ లవ్లీ ఝలక్ ఇచ్చాడు. రెండు రోజుల క్రితం తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని చెప్పిన అర్విందర్‌సింగ్ లవ్లీ శనివారం నాడు బీజేపీ కండువ కప్పుకున్నాడు. ఇక అర్విందర్ రాజీనామా చేయడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీపార్టీతో పొత్తు పెట్టుకోవడమే. ఆప్‌తో పొత్తును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
ఒడిషాలో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. పూరి లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సుచరితా మొహంతి పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రచారానికి కాంగ్రెస్ అధిష్టానం నిధులు ఇవ్వడానికి నిరాకరించడంతో తాను పోటీ చేయలేనని చేతులెత్తేశారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే ఒకరి నొకరు కొట్టుకుంటే ... వారు విద్యార్థులను ఉత్తమ పురుషులుగా ఎలా తీర్చగలుగుతారు? వీరిని చూసి వారు కూడా రౌడీల్లా తయారవుతారేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకు అసలు కథ ఏంటో చూద్దాం. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.
గతంలోని బలహీనమైన కాంగ్రెస్ ప్రభుత్వం టెర్రరిజాన్ని అణిచి వేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. జార్ఖండ్‌లో శనివారం నాడు ఆయన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. పొరుగు దేశంతో శాంతి కోసం వెంపర్లాడేందుకు ప్రేమ లేఖలు పంపించేది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే దీనికి బదులుగా పాకిస్తాన్ దేశంలోకి పెద్ద ఎత్తున టెర్రరిస్టులను పంపి అమాయకులను ఊచకోత కోసేది.
ఆమ్ ఆద్మీపార్టీ చీఫ్ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అచ్చే దిన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకసభ ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకు ముందు సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను 2024 లోకసభ ఎన్నికలకు ముందు అరెస్టు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది.
మన దేశంలో రాజభవన్లు గవర్నర్ల కామ క్రీడలకు వేదికలుగా మారాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన ఎన్డీ తివారి ఉదంతం అందరికి తెలిసిందే. తాజాగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ మహిళలను లైంగికంగా వేధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి