Home / జాతీయం
మన దేశంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం అంటే కొందరికి సరదా.. మరి కొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ నిబంధనలు అలవొకగా ఉల్లంఘిస్తుంటారు. అయితే దేశంలోని చండీఘడ్ను తీసుకుంటే గత 15 నెలల్లో 18 లక్షల రెడ్ లైట్ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్‌కు నేటితో తెరపడింది. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ లోకసభ సీటుకు నామినేషన్ ఫైల్ చేశారు. కాగా నామినేషన్ ఫైల్ చేయడానికి ఆయన వెంట మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలు వచ్చారు.
అమెధీ ,రాయబరేలి నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అమెధీ నుంచి రాహుల్ పోటీ చేయాల్సి ఉండగా.. ఆయన తల్లి నియోజకవర్గం అయిన రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే అమెధీ నుంచి కాంగ్రెస్‌పార్టీకి అత్యంత నమ్మకస్తుడు కెఎల్ శర్మను పోటీకి నిలబెట్టింది. గత 40 సంవత్సరాల నుంచి ఆయన పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నాడు.
డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు డిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య సీమాను కలిసేందుకు వారానికి ఒకసారి అనుమతించింది. అది ఈడీ, సీబీఐ అధికారులు సమక్షంలోనే మాత్రమే అని షరుతు విధించింది.
ఎట్టకేలకు అమెథీ, రాయబరేలీ లోకసభ నియోజకవర్గాల్లో ఎవరూ పోటీ చేస్తారనే సస్పెన్స్ తెరపడింది. రాహుల్ గాంధీ అమెధీ నుంచి కాకుండా తన తల్లి నియోజకవర్గం అయిన రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనదైన శైలిలో రాహుల్‌గాంధీపై సెటైర్లు విసిరారు. 'డరో మత్, బాగోమత్" అంటూ ఎద్దేవా చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అబ్ కీ బార్ 400 పార్ అంటూ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే 400 పై చిలుకు సీట్లు సాధిస్తామనేది ఆయన ధీమా. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ మాత్రం 400 పార్ ఓ పెద్ద జోక్, 300 పార్ అసంభవం.. 200 పార్ అతి పెద్ద చాలెంజ్ అని అన్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. మహిళా రెస్లర్లను లైంగికంగా వేధించాడని ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దేశ రాజధానిలో క్రీడాకారులంతా ఆయనను అరెస్టు చేయాలని, ఆయన చేతిలో తాము లైంగిక వేధింపులకు గురయ్యామని ప్రధాని నుంచి హోంమంత్రి వరకు ప్రతి ఒక్కరికి ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటకలో సెక్స్ స్కాండల్‌లో కూరుకుపోయిన జెడి ఎస్యుతో ఎన్నికల ఒప్పందం కుదుర్చుకొని మాస్ రెపిస్టు కోసం ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. క
డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకె సక్సేనా డిల్లీ కమిషన్ ఫర్ విమెన్‌పై (డీసీడబ్ల్యు) పై కన్నెర్ర జేశారు. స్వాతిమలీవాల్ డీసీడబ్ల్యు చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు .. ఫైనాన్స్డిపార్టుమెంట్ కానీ.. లేదా అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా 233 మందిని దిల్లీ కమిషన్ ఫర్ విమెన్‌లో ఉద్యోగులను నియమించారు.
కర్ణాటక సెక్స్ టేప్‌ల కేసు మరింత జటిలం అవుతోంది. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ్ మనవడు పలువురు మహిళలో జరిపిన రాసలీల టేపు ప్రస్తుతం కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతోంది. గత నెల 26న లోకసభ ఎన్నికల పోలింగ్ మగిసిన వెంటనే ప్రజ్వల్ దేశం విడిచి జర్మనీ పారిపోయాడు. కాగా ఆయనపై గ్లోబల్ లుక్ అవుట్‌నోటీసు జారీ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది.