Home / జాతీయం
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నెలకొంది. సోమవారం నాడు ఐదవ విడత పోలింగ్ జరుగుతోంది. ఇక మిగిలింది కేవలం రెండు విడతల పోలింగ్ మాత్రమే. ఇక అందరి దృష్టి స్టాక్ మార్కెట్లపై పడింది. ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఐదవ విడత లోకసభ పోలింగ్ జరుగుతోంది. ముంబైలో పోలింగ్ సందర్బంగా బాలీవుడ్ ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో హ్రితిక్ రోషన్ ఆయన కుటుంబసభ్యులున్నారు. ఓటు వేసి వచ్చిన తర్వాత ఆయన కొంత సేపు మీడియాతో ముచ్చటించారు
కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ర్ట బీజేపీ నాయకుడు జీ దేవరాజ్ గౌడను శుక్రవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పోలీస వాహనంలో తరలిస్తుండగా కొద్ది సేపు మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా మోదీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఖర్గే ఎన్నికల కమిషన్‌ను కోరారు.
స్వాతి మలీవాల్‌పై జరిగిన దాడి కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతిమలీవాల్ కేజ్రీవాల్‌ను పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్లినప్పుడు కేజ్రీవాల్ పర్సెనల్ సెక్రటరీ తనపై దాడి చేశాడని ఆమె పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు
ఆమ్ ఆద్మీపార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా బ్రిటన్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. వెంటనే ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇంటికి పరామర్శించడానికి వచ్చారు. కాగా కంటి చికిత్స కోసం ఆయన లండన్ వెళ్లారు దీర్ఘకాలం పాటు అక్కడే ఉన్నారు.
భారతీయ జనతాపార్టీ అబ్ కీ బార్ 400 పార్ అంటూ ఎన్నికలకు ముందు ఈ నినాదం హోరెత్తించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి అమిత్ షా వరకు దేశంలోని ప్రతి బీజేపీ కార్యకర్త అబ్ కీ బార్ 400 పార్ నినాదాన్ని తలెత్తుకున్నాడు. అయితే ప్రారంభంలో ఉన్న జోష్ ఇప్పుడు మాత్రం కనపడ్డం లేదు
ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటించి ఓట్లు దండుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక జాతీయ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల సందర్భంగా ఇచ్చే తాయిలాల గురించి పలు ప్రశ్నలు సంధించారు.
ముంబైలో గత సోమవారం సాయంత్రం ఘాట్కోపర్ ప్రాంతంలో అతి పెద్ద హోర్డింగ్ కూలి సుమారు 16 మంది చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ముంబై పోలీసులు అడ్వర్టజింగ్ ఏజెన్సీ డైరెక్టర్ భావేష్ భిండేను గురువారం నాడు ఉదయ్‌పూర్‌లో అరెస్టు చేశారు. ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ హోర్డింగ్ కాంట్రాక్టు దక్కించుకుంది.
ఉన్నత విద్యకు కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థులను తిరిగి వెనక్కిపంపేందుకు కెనడా ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రాంతంలో విద్యార్థులు శుక్రవారం నాడు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. తమను బలవంతంగా ఇండియాకు పంపవద్దని ప్రభుత్వానికి వారు మొరపెట్టుకుంటున్నారు.