Last Updated:

Hyderabad IT Jobs: ఐటి కొలువుల్లో బెంగళూరును దాటేసిన హైదరాబాద్‌

ఐటి ఉద్యోగాలకు హైదరాబాద్‌ స్వర్గథామంగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఐటి రంగంలో అవకాశాలు తగ్గిపోతుంటే .. హైదరాబాద్‌ మాత్రం ఐటీ ఉద్యోగాలు పుష్కలంగా లభిస్తున్నాయని గ్లోబల్‌ హైరింగ్‌ ఫ్లాట్‌ ఫాం ఇండిడ్‌ తాజా గణాంకాలతో సహా వివరించింది.

Hyderabad IT Jobs: ఐటి కొలువుల్లో బెంగళూరును దాటేసిన  హైదరాబాద్‌

Hyderabad IT Jobs: ఐటి ఉద్యోగాలకు హైదరాబాద్‌ స్వర్గథామంగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఐటి రంగంలో అవకాశాలు తగ్గిపోతుంటే .. హైదరాబాద్‌ మాత్రం ఐటీ ఉద్యోగాలు పుష్కలంగా లభిస్తున్నాయని గ్లోబల్‌ హైరింగ్‌ ఫ్లాట్‌ ఫాం ఇండిడ్‌ తాజా గణాంకాలతో సహా వివరించింది. తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూస్తే ఏప్రిల్‌ 2023 నుంచి ఏప్రిల్‌ 2024 వరకు ఇండిడ్‌ ప్లాట్‌ఫాం ద్వారా 41.5 శాతం పోస్టింగ్‌లు జరిగాయని తెలిపింది. దీంతో ఇప్పటి వరకు ఐటి ఉద్యోగాల్లో బెంగళూరు అగ్రస్థానంలో ఉండేది. దాన్ని హైదరాబాద్‌ వెనక్కి నెట్టింది. బెంగళూరు కంటే జాబ్‌ ప్లేస్‌మెంట్‌లో హైదరాబాద్‌ 24 శాతం ఆధిక్యతతో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఐటి ప్రొఫెషనల్స్‌కు హైదరాబాద్‌లో ఉద్యోగాలకు మంచి అవకాశాలున్నాయని తేలిపోతోంది.

161 శాతం పెరుగుదల..(Hyderabad IT Jobs)

ఐటి ఉద్యోగాల విషయానికి వస్తే జాబ్‌క్లిక్స్‌ ద్వారా ఏకంగా 161 శాతం ప్లేస్‌మెంట్‌లు పెరిగితే అదే బెంగళూరులో 80 శాతంమాత్రమే పెరిగాయి. దీంతో ఉద్యోగాల కోసం ఐటి రంగానికి చెందిన నిపుణులు బెంగళూరు కంటే కూడా హైదరాబాద్‌ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తేలింది. ఇక దేశవ్యాప్తంగా చూస్తే ఐటి ఐటి రంగంలో జాబ్స్‌ క్రమంగా తగ్గిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో యుద్ధాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది. దీంతో ఐటి రంగంలో పోస్టింగ్‌లు 3.6 శాతం క్షీణించాయి.

ఇండిడ్‌ ఇండియా సేల్స్‌ హెడ్‌ శశికుమార్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఐటి రంగంలో అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని కంపెనీల్లో లేఆఫ్‌లున్నా.. ఇక్కడ ఉద్యోగావకాశాలు మాత్రం మెరుగ్గా ఉన్నాయి. అయితే ఈ రంగంలో ప్రత్యేకంగా స్కిల్స్‌, అనుభవం ఉంటే అవకాశాలు మెండుగా ఉంటాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఐటి రంగంలో డిమాండ్‌ ఉన్న ఉద్యోగాల విషయానికి వస్తే అనలిసిస్‌ స్కిల్స్‌, ఏజిల్‌ మెథలాడిజీస్‌, ఏపీఐస్‌, జావా స్ర్కిప్ట్‌, ఎస్‌క్యూఎల్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని శశికుమార్‌ వివరించారు.

ఇవి కూడా చదవండి: