Home / జాతీయం
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై వాప్కోస్ మాజీ సీఎండి రాజిందర్ గుప్తా మరియు అతని కుటుంబ సభ్యులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కేసు నమోదు చేసింది. వీరికి సంబంధించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
ఈ నెల 10న రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ప్రధాన రాజకీయపార్టీలు ఓటర్లకు పంచడానికి పెద్ద ఎత్తున నగదును సిద్దం చేసాయి. ఈ నేపధ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమకు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి వీటిని స్వాధీనం చేసుకుంటున్నారు.
భవిష్యత్ లో టోల్ ప్లాజాల అవసరం లేకుండా ఫీజులు వసూలు చేసేందుకు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు రవాణాశాఖ తెలిపింది.
అజిత్ పవార్.. ఎన్సీపీని వీడి బీజేపీ చేరతారనే ఊహాగానాల మధ్య పవార్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ చాలా గ్యాప్ తరువాత పఠాన్ సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చాడు. ఈ చిత్రం కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకుని షారూఖ్ ను, అతని అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఇపుడు షారూఖ్ పఠాన్ గెటప్ లో పశ్చిమబెంగాల్ మ్యూజియంలో పలువురిని అలరిస్తున్నాడు.
తమిళ సినీ రంగానికి చెందిన షాలిని ముల్లుమ్ అనే నటికి బుల్లితెరతో మంచి పేరు తెచ్చుకుంది. జీ తమిళ్ లో ప్రసారమయ్యే సూపర్ మామ్ రియాల్టీ షోలో కూడా ఆమె పాల్గొంది.
: కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన స్మార్ట్ సిటీస్ మిషన్ గడువును ఈ ఏడాది జూన్ నుండి జూన్ 2024 వరకు పొడిగించినట్లు మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.2015లో ప్రారంభించబడిన ఈ మిషన్ జనవరి 2016 నుండి జూన్ 2018 వరకు పోటీ ప్రక్రియ ద్వారా 100 నగరాలను ఎంపిక చేసింది.
2019 నాటి ‘మోదీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసులోకాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ సెలవుల తర్వాత తీర్పును వెలువరించనున్నారు. అయితే అప్పటి వరకు రాహుల్ గాంధీకి మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు కోర్టు నిరాకరించింది.
Bengaluru: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం కోసం వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ను పక్షి ఢీకొట్టింది. దీంతో హెలికాఫ్టర్ ను హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ఎమెర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో హెలికాప్టర్ అద్దం పగిలింది. కాగా, శివకుమార్ ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు బెంగళూరులోని జక్కూర్ ఎయిర్‌పోర్టు నుంచి కోలార్ జిల్లాలోని ముల్బాగల్ కు […]
దేశంలోని మొత్తం 62 ఆర్మీ కంటోన్మెంట్ బోర్డులను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. కంటోన్మెట్ పరిధిలోని పౌర ప్రాంతాలను మునిసిపల్ బాడీలకు అప్పగిస్తామని, ఆర్మీ ఏరియాను మిలటరీ స్టేషన్లుగా మారుస్తామని ప్రభుత్వం తెలిపింది.హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని పిట్చర్స్క్యూ యోల్ కంటోన్మెంట్ హోదాను కోల్పోయిన మొదటి పట్టణంగా నిలిచింది.