Home / జాతీయం
పెళ్లికని బయలుదేరారు. బంధువుల ఇంట్లో పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. నూతన వధూవరులను ఆశీర్వదించాలని కుటుంబమంతా సంతోషంతో కారులో బయలుదేరారు. సందడి సందడిగా శుభకార్యానికి వెళ్తున్నామనే జోష్ తో సరదాగా మాట్లాడుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు.
మహిళల భద్రతతో పాటు డ్రగ్స్ వ్యాపారులపై నిఘా ఉంచే లక్ష్యంతో జమ్మూ నగరంలోని పలు కీలక చెక్‌పోస్టుల వద్ద రాత్రి వేళల్లో మహిళా కానిస్టేబుళ్లను మోహరించినట్లు అధికారులు తెలిపారు.రాత్రి వేళల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించడం ఇదే తొలిసారి అని వారు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కర్ణాటకలో పద్మ అవార్డు గ్రహీతలు తులసి గౌడ, సుక్రి బొమ్ము గౌడలను కలిశారు.కర్ణాటకలోని ముద్బిద్రిలో జరిగిన ర్యాలీలో ప్రధాని బుధవారం ప్రసంగించారు. అనంతరం ఇద్దరు మహిళలతో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు
జనరల్ గా రుతుపవనాలకు ముందు ఏప్రిల్-మే-జూన్ సీజన్లో బంగాళాఖాతం లో తరచూ తుపానులు ఏర్పడుతుంటాయి. కానీ మే నెలలో తుపాన్ల ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సిఎపిఎఫ్‌లు) మరియు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డిఆర్ఎఫ్) సిబ్బంది భోజనంలో మిల్లెట్స్ ను ప్రవేశపెట్టాలని హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ మంగళవారం ఇన్నర్ లైన్ పర్మిట్ (ఐఎల్పి) హోల్డర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, కొత్తగా ప్రారంభించిన సిస్టమ్ ఇన్నర్ లైన్ పర్మిట్ కౌంటర్లలో చెల్లుబాటు గడువు ముగిసిన వారిని సమర్థవంతంగా తనిఖీ చేయడంలో సహాయపడుతుందని అన్నారు.
మే 6న బ్రిటన్ రాజు చార్లెస్ పట్టాభిషేక వేడుక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తమకు ఆహ్వానం అందిందని ముంబైకి చెందిన ప్రముఖ డబ్బావాలాలు తెలిపారు. దీనికోసం వారు బహుమతులు కొనుగోలు చేసారు
ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ యాత్రను బుధవారం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని చార్ ధామ్‌లలో కేదార్నాథ్ ధామ్ ఒకటి. ఆ ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు
: తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న శక్తివంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడటం చాలా కష్టమని రెజ్లర్ వినేష్ ఫోగట్ అన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్ మరియు బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ఇతర అగ్రశ్రేణి రెజ్లర్లతో కలిసి ఆమె నిరసన తెలుపుతున్నారు.
స్వలింగ జంటల యొక్క కొన్ని ఆందోళనలు మరియు రోజువారీ జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తీసుకోగల పరిపాలనా చర్యలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది.