Home / జాతీయం
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో దెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును రెండవ అనుబంధ చార్జీషీటులో నమోదు చేసింది.
మరో ఏడాదిలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగబోతున్న నేపధ్యంలో ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని రాజకీయ పార్టీలు కన్నడ ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి.
తీవ్రవాద నిధుల కేసుకు సంబంధించి, జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఏ) మంగళవారం తెల్లవారుజామున కశ్మీర్ లోయలో దాదాపు డజను ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. అధికారులు అందించిన సమాచారం మేరకు దర్యాప్తు సంస్థ ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించింది.
దర్శకుడు సుదీప్తో సేన్ యొక్క హిందీ చిత్రం, ది కేరళ స్టోరీ.. గత సంవత్సరం టీజర్‌ను విడుదల చేసినప్పటి నుండి వార్తలలో ఉంది. మే 5న విడుదల కానున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది.
అయోధ్యలో 28 ఏళ్ల ఆలయ పూజారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. స్దానిక నరసింహ ఆలయ పూజారి రామ్ శంకర్ దాస్ తన ఆత్మహత్యాయత్నాన్ని ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. పోలీసుల వేధింపుల వల్లే తానుఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపించారు.
ఢిల్లీ రోహిణి కోర్టు కాల్పుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా మంగళవారం తీహార్ జైలులో ప్రత్యర్థి ముఠా సభ్యులు అతనిపై దాడి చేయడంతో మరణించాడు. పధకం ప్రకారమే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఏ నెలకు ఆ నెల వస్తు సేవల పన్ను వసూళ్లలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాఖలు చేసిన మూడవ చార్జిషీటులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుని ఈడీ మరోసారి ప్రస్తావించింది. ఈసారి ఈడీ మరికొన్ని కీలక అంశాలని బయటపెట్టింది. 2023 మార్చి 28న కవిత పిఎ బుచ్చిబాబు ఇచ్చిన వివరాలని చార్జిషీట్లో ఈడీ పొందు పరిచింది.
Sedition law: రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజద్రోహం చట్టంపై మళ్లీ సమీక్ష చేస్తామని కేంద్రం చెప్పింది. రానున్న వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రాజ ద్రోహం చట్టం సవరణ బిల్లును తెస్తామని తెలిపింది. దీంతో రాజద్రోహం కింద నమోదైన కేసులను ఆగస్టు రెండో వారంలో విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఆగస్టుకు వాయిదా వేస్తూ..(Sedition law) కాగా.. బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహ చట్టం చట్టబద్ధతను సవాల్ చేస్తూ […]