Home / జాతీయం
మహిళా రెజ్లర్ల పై లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) ప్రెసిడెంట్ మరియు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తనను లక్ష్యంగా చేసుకున్న వారిపై స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
మే 10న జరగబోయే కర్ణాటక ఎన్నికల కోసం భారతీయ జనతాపార్టీ మేనిఫెస్టో ‘ప్రజాధ్వని’ని సోమవారం విడుదల చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పార్టీ సీనియర్ నేత బిఎస్ యడియూరప్ప సమక్షంలో బీజేపీ అధ్యక్షుడు నడ్డా మేనిఫెస్టోను విడుదల చేశారు.
19 కిలోల కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పిజి) సిలిండర్ల ధరలు రూ. 171.50 తగ్గాయి. తగ్గిన ధరలు మే 1 నుంచి అమలులోకి వస్తయి సవరణ తరువాత, ఢిల్లీలో నేటి నుండి 19 కిలోల ఎల్పిజి సిలిండర్ రూ.1,856.50 ధరకు అందుబాటులో ఉంటుంది.
పాకిస్తాన్‌లోని తమ ఉన్నతాధికారులతో "రహస్యంగా" కమ్యూనికేట్ చేయడానికి మిలిటెంట్ గ్రూపులు ఉపయోగించిన కనీసం 14 మొబైల్ అప్లికేషన్లను కేంద్రం నిషేధించింది. ప్రభుత్వం నిషేధించిన వాటిలో క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్స్విస్, విక్రమ్, మీడియాఫైర్, బ్రియార్, బీఛాట్, నందబాస్, కొనిన్, ఇమో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జంగి అండ్ త్రీమా ఉన్నాయి.
దంపతుల మధ్య వివాహబంధం విచ్చిన్నమై కలిసి బ్రతకలేని పరిస్దితికి వచ్చినపుడు వివాహాలను రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం ఆరు నెలల తప్పనిసరి నిరీక్షణ అవసరం లేదని కూడా తెలిపింది.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన 'విష పాము' వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం స్పందించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షం నన్ను పాముతో పోల్చి ఓట్లు వేయవద్దని అడుగుతోంది కానీ పాము అంటే శివుని మెడలోని అలంకారం.
వివిధ జాతులకు చెందిన 22 పాములతో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలిని చెన్నై విమానాశ్రయంలో శుక్రవారం అరెస్టు చేశారు.కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఈ మహిళ చెక్-ఇన్ లగేజీలో పాములనుప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేశారు.
హర్యానాకు చెందిన 90 శాతం మంది అథ్లెట్లు మరియు వారి సంరక్షకులు తమను విశ్వసిస్తున్నారని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్ మరియు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ రేడియో షో ‘మన్ కీ బాత్’ నేటితో 100 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ను ప్రారంభిస్తూ ప్రధాని మోదీ విజయదశమి మాదిరిగానే మన్ కీ బాత్ కూడా భారతీయుల మంచితనం, ఆశావాదం, సానుకూలత మరియు ప్రజల భాగస్వామ్యాన్ని జరుపుకునే సందర్భం అని అన్నారు.
బీహార్ లో మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ ను జైలు నుంచి విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దివంగత ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య భార్య శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నితీష్ కుమార్ ప్రభుత్వం జైలు నిబంధనలను మార్చి ఆనంద్ మోహన్ ను రిలీజ్ చేయడాన్ని పలు రాజకీయపార్టీలు, సివిల్ సర్వీస్ అధికారులు తప్పు బట్టిన విషయం తెలిసిందే.