Home / జాతీయం
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పూంచ్ ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది.
‘ది కేరళ స్టోరీ’ సినిమాలో ఇస్లాం మతానికి విరుద్ధంగా ఏముందని, విడుదలను నిలిపివేయాలని కోరుతున్నారని పిటిషనర్లను కేరళ హైకోర్టు ప్రశ్నించింది. ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలయింది.
ఘన మరియు ద్రవ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడంలో విఫలమైనందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బీహార్ కు రూ.4,000 కోట్ల జరిమానా విధించింది.ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా రింగ్ఫెన్స్డ్ ఖాతాలో జమ చేయాలని, రాష్ట్రంలోని వ్యర్థాల నిర్వహణ కోసం మాత్రమే ప్రధాన కార్యదర్శి ఆదేశాల ప్రకారం నిర్వహించాలని చైర్పర్సన్ జస్టిస్ ఏకే గోయల్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ తన పదవి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్న రెండు రోజుల తరువాత, శుక్రవారం ఆయన ఏర్పాటు చేసిన 18 మంది సభ్యుల కమిటీ అతని రాజీనామాను తిరస్కరించింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ యాత్రను నిలిపివేశారు. చమోలి జిల్లాలోని హెలాంగ్ గ్రామం సమీపంలో కొండపై నుంచి భారీగా చెత్తాచెదారం రావడంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని అడ్డుకున్నారు.
బరేలీ పట్టణంలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో ప్రియదర్శిని నగరలో ఓ పాత కబాబ్ దుకాణం ఉంది. బుధవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు
Manipur Violence: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు మరింత చెలరేగుతున్నాయి. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకకు చేరుకుంటోంది. ఎన్నికలకు వారం రోజులు కూడా లేకపోవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని విస్తృతం చేశాయి.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు చేపట్టిన విచారణను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది.
Anil Dujana: ఉత్తరప్రదేశ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్.. కరుడుగట్టిన నేరగాడు అనిల్ దుజానా పోలీసులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు.