Home / జాతీయం
రిజర్వేషన్ల కారణంగా హింసాత్మక ఘటనలు రేగిన మణిపూర్ నుండి వందలాది మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ నేపధ్యంలో ప్రయాణీకుల డిమాండ్ పెరిగిపోవడంతో ఇండిగో మరియు ఎయిర్ ఏషియాతో సహా పలు విమానయాన సంస్థలు తమ ఛార్జీలను పెంచాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో డీఆర్జీ జవాన్లు, నక్సల్స్ మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్‌పురం అడవుల్లో నక్సల్స్, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
Kerala Boat: మలప్పురం జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది.
మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తరలించడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు హెల్ప్లైన్లను ఏర్పాటు చేశాయి. మణిపూర్ ప్రభుత్వంతో ఏపీ, తెలంగాణ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కుంభకోణంలో ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న సుకేష్ చంద్రశేఖర్, కేజ్రీవాల్ ఇంట్లో విలాసవంతమైన గృహోపకరణాలకు నిధులు సమకూర్చినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశాడు.
Personal loan: చాలామంది కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తిగత రుణం తీసుకుంటారు. కొందరు ఛార్జీలపై పెద్దగా అవగాహన లేకుండానే వ్యక్తిగత రుణం తీసుకుంటారు.
తమిళనాడులోని మల్టీప్లెక్స్ థియేటర్లు నేటి నుండి ది కేరళ స్టోరీ చిత్రం యొక్క ప్రదర్శనలను నిలిపివేసాయి. శాంతిభద్రతల పరిస్థితి కారణంగా వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ది కేరళ స్టోరీ విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టికె) శనివారం చెన్నైలో నిరసనకు దిగింది
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డానని, తనపై ఒక్క ఆరోపణ అయినా రుజువైతే ఉరివేసుకుంటానని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ అన్నారు.
Kishan Reddy: మణిపూర్‌లో చెలరేగిన ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 55 కి చేరింది. అయితే రెండు రోజుల హింసాకాండ తరువాత, కొన్ని ప్రాంతాలు సాధారణ స్థితికి వచ్చాయి.
శనివారం అర్థరాత్రి గోల్డెన్ టెంపుల్ సమీపంలో పేలుడు సంభవించడంతో సుమారుగా డజనుమంది వ్యక్తులు గాయపడ్డారు. పేలుడు ధాటికి, భవనాలకు ఎటువంటి నష్టం జరగనప్పటికీ సమీపంలోని రెస్టారెంట్ మరియు కిటికీలు ధ్వంసమయ్యాయి