Ugadi Wishes : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ‘శోభకృత్’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ, ఇరు రాష్ట్రాల సీఎంలు జగన్ , కేసీఆర్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, గవర్నర్లు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆ ట్వీట్స్ ప్రత్యేకంగా మీకోసం..
Ugadi Wishes : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ, ఇరు రాష్ట్రాల సీఎంలు జగన్ , కేసీఆర్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, గవర్నర్లు, పలువూరు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆ ట్వీట్స్ ప్రత్యేకంగా మీకోసం..
అందరికీ ఉగాది శుభాకాంక్షలు ! pic.twitter.com/cG5Yb3D3X7
— Narendra Modi (@narendramodi) March 22, 2023
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లోనూ శుభాలు చేకూర్చాలన్నారు. ఈ శోభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణతోపాటు దేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. సాగు, తాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణ నిత్యవసంతంగా మారిందన్న కేసీఆర్.. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందన్నారు. తెలంగాణ సాధించే ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ అన్నారు.
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ‘శోభకృత్’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తంచేశారు. తాగు, సాగు నీరు, పచ్చని పంటలతో తెలంగాణలో నిత్య… pic.twitter.com/DRfUX4mKLN
— Telangana With KCR (@TSwithKCR) March 22, 2023
ఉగాది. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ స్పందించారు. తెలుగు ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభం జరగాలని ఆకాంక్షించారు. సమృద్ధిగా వానలు కురవాలి, రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఇల్లు కళకళలాడాలని, మన సంస్కృతి వెల్లివిరియాలని సీఎం జగన్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శోభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలని, రైతులకు మేలు కలగాలని, నా అక్కచెల్లెమ్మలు ఆనందంగా ఉండాలని, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 22, 2023
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శోభకృత నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వెల్లడించారు
తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శోభకృత నామ నూతన సంవత్సర #Ugadi శుభాకాంక్షలు.#Ugadi#Ugadi2023 pic.twitter.com/t9nV02YgNg
— JanaSena Party (@JanaSenaParty) March 22, 2023
ఈ ఉగాదితో శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
“మన సంస్కృతి, సంప్రదాయ పండగ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు. శోభకృత్ నామ సంవత్సరం అందరికీ శుభాలు కలగజేయాలి. తెలుగు లోగిళ్లు కొత్త శోభ సంతరించుకోవాలి. కొత్త ఆశయాలు నెరవేరి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నవ్యోత్సాహంతో ఉగాది జరుపుకోవాలి” అని లోకేశ్ ఆకాంక్షించారు.
ఇక బాలయ్య స్పందిస్తూ… రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరితోపాటు దేశవిదేశాల్లోని తెలుగువారందరికీ ‘‘ఉగాది’’ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. ఈ తెలుగు సంవత్సరాది ప్రతి తెలుగువాడికీ నిత్య ‘శోభకృతం’ కావాలని ఆకాంక్షించారు. “శ్రీ శుభకృత్ శుభాలను మననం చేసుకోండి, ఎదురైన అశుభాలను మరిచిపోండి. రాబోయే శ్రీ శోభకృత్ స్ఫూర్తిని గుండెల్లో నింపుకోండి. ప్రతిఒక్కరికీ శ్రీ శోభకృత్ నిత్య శోభాయమానం కావాలి. గత విజయాల స్ఫూర్తితో, భావి విజయ పరంపర వైపు దూసుకెళ్లాలి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లన్న పూజ్యుల ప్రబోధమే మనందరి బాట” అని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్త తెలుగువారందరికీ శోభకృత్ నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగుదేశం #Ugadi pic.twitter.com/z35frKHq2K
— Telugu Desam Party (@JaiTDP) March 22, 2023
I am confident that ‘Shobhakruthu Ugadi festival will usher in peace, prosperity, harmony and happiness to the people of all sections in the State.”#Ugadi2023
— governorap (@governorap) March 22, 2023
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.ఈ ఉగాది ప్రజలందరి జీవితాలలో ఆరోగ్యాన్ని,అభివృద్ధిని, ఆనందాన్ని నింపాలని ఆకాంక్షిస్తున్నాను.#HappyUgadi#TeluguNewYear pic.twitter.com/X8lbm97zWv
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 21, 2023