Last Updated:

Khushbu Sundar: రాహుల్‌ కు జైలుశిక్ష.. ఖుష్బూ పాత ట్వీట్‌ వైరల్

Khushbu Sundar: రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దవడంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే గతంలో ప్రధాని మోదీ పేరును కించపరుస్తూ నటి.. ప్రస్తుత భాజపా నాయకురాలు ఖుష్బూ సుందర్‌ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Khushbu Sundar: రాహుల్‌ కు జైలుశిక్ష.. ఖుష్బూ పాత ట్వీట్‌ వైరల్

Khushbu Sundar: రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దవడంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే గతంలో ప్రధాని మోదీ పేరును కించపరుస్తూ నటి.. ప్రస్తుత భాజపా నాయకురాలు ఖుష్బూ సుందర్‌ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ట్వీట్ లో ఏముందంటే? (Khushbu Sundar)

ప్రధాని మోదీ ఇంటిపేరును కించపర్చారన్న అభియోగాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి శిక్ష పడింది. ఆ తర్వాత ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దవడం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ పరిణామాలతో కేంద్రంపై విపక్షాలు భగ్గుమంటున్న వేళ.. భాజపా నాయకురాలు ఖుష్బూ సుందర్‌ గతంలో చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అందులో ఖుష్బూ.. ప్రధానిపై ఘాటు విమర్శలు చేశారు.
అయితే ఈ ట్వీట్ పై కాంగ్రెస్ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రధాని మోదీ పేరును కించపర్చేలా మాట్లాడిందని, ఆమెపై ఇప్పుడు కేసు పెడతారా? అని కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు.

2018లో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా ఖుష్బూ ఉన్నారు. ఆ సమయంలో మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ కుంభకోణాలను ప్రస్తావించిన ఆమె.. మోదీ అంటే అర్థం అవినీతి అని మార్చాలి. అది సరిగ్గా సరిపోతుంది అంటూ ట్వీట్ చేశారు. రాహుల్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే ఆయనకు సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలోనే ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆయనపై అనర్హత వేటు పడింది.

దీంతో కాంగ్రెస్‌ మద్దతుదారులు ఇప్పుడు ఖుష్బూ పాత ట్వీట్‌ను వైరల్‌ చేస్తున్నారు. ఈ పాత ట్వీట్ తో మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఖుష్బూ పై కూడా కేసు పెడతారా అంటూ భాజపాను ప్రశ్నిస్తున్నారు. 2020లో ఖుష్బూ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

భాజపాలో చేరిన తర్వాత నేతలపై కేసులు మాయమవుతున్నాయని దుయ్యబడుతున్నాయి. ఈ క్రమంలో ఖుష్బూ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

పాత ట్వీట్‌పై స్పందించిన ఖుష్బూ

గతంలో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ తాను చేసిన ట్వీట్‌పై ఖుష్బూ స్పందించారు. పార్టీ ఆదేశాల మేరకే తాను అలా స్పందించానని, అప్పటి పార్టీ అధినేత వైఖరినే అనుసరించినట్లు చెప్పారు.

‘ఆ సమయంలో నేను కాంగ్రెస్‌లో ఉన్నా. పార్టీ అధికార ప్రతినిధిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించా. మేం అలాగే మాట్లాడాలి. నేనూ అదే చేశా.

అభిప్రాయాల వ్యక్తీకరణ విషయంలో పార్టీ అధినేతను అనుసరించా’ అని వివరించారు.

తన ట్విటర్‌ ఖాతాలో ఇప్పటివరకు ఏ ట్వీట్‌నూ తొలగించలేదని, ఆ పోస్టునూ కూడా తొలగించనని స్పష్టం చేశారు.